పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాతో బిజీ గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. జూన్ నెల నుండి కూడా ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. ప్రస్తుతం వినోదయ సిత్తం రీమిక్ సినిమా తో బిజీ గా వున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత వచ్చే నెల నుండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు.

Video Advertisement

హరిహర వీరమల్లు సినిమా అయితే దసరా కి రిలీజ్ అవుతుందని అంతా అంటున్నారు. అయితే ఈ సినిమాని 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెర మీద కి తీసుకు రాబోతున్నారట.

ఇంకా ఈ సినిమా కి సంబంధించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా అప్డేట్స్ రావచ్చని అంటున్నారు. ఒక్కో సినిమా కి పవర్ స్టార్ 75 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయలని తీసుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి నిర్మాత ఏ ఎమ్ రత్నం పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పవన్ ఏ ఎమ్ రత్నం ఇప్పటికీ చాలా సినిమాలు తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ని మొదలు పెట్టి 27 ఏళ్లు పూర్తయింది. ఇక పవన్ రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలు అవుతోంది.

దాంతో రత్నం ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. పవన్ మనసు ప్రజల మీద ఉంటే… ఆయన తనువు వెండి తెర మీద ఉందని అన్నారు ఆయన మంచితనాన్ని గొప్ప తనాన్ని వివరించారు రత్నం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాల్లో కూడా అందరి మనసు ని గెలిచారని అన్నారు. 27 ఏళ్ల సినీ జీవితం తొమ్మిదేళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పారు. అదే విధంగా ఆయన ఉన్నత శిఖరాలని చేరుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు రత్నం.