నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతకాలం వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ‘ సింహా ‘ మూవీ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఘనత బోయపాటి కే దక్కుతుంది. ఒకరకంగా చెప్పాలి అంటే బాలయ్య లోని మాస్ సింహాన్ని నిద్ర లేపిన డైరెక్టర్ బోయపాటి.

Video Advertisement

సింహ తర్వాత తన మూవీస్ తిరిగి వరసగా ఫ్లాప్ అవుతున్న సందర్భంలో తిరిగి బోయపాటి కాంబోలో లెజెండ్ అనౌన్స్ చేశాడు బాలయ్య. లెజెండ్ నిజంగానే లెజెండ్రీ సెన్సేషన్ సృష్టించింది. వీళ్ళ ఇద్దరిదీ తిరుగులేని కాంబినేషన్ అనడానికి నిదర్శనంగా లెజెండ్ నిలబడింది.

boyapati

తర్వాత కొంతకాలానికి తిరిగి వీళ్ళ కాంబినేషన్లో సెట్ అయిన మూవీ ‘అఖండ’. హ్యాట్రిక్ కొట్టడం కన్ఫామ్ అనుకున్న మూవీ కాస్త తిరుగులేని హిట్ గా నిలిచింది. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ 100 కోట్ల మార్కెట్ టచ్ చేసింది. కుర్ర హీరోలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికెల పడుతున్న ఈ టైంలో బాలకృష్ణ అఖండ బాక్సాఫీస్ ను బంతాట ఆడింది. అక్కడితో ఆగకుండా ఓటీటీ స్ట్రీమింగ్‌ లో కూడా తన సత్తా చూపింది. చివరకు గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ లో ‘అఖండ’ స్క్రీనింగ్ అయ్యింది.

Akhanda movie trolls

ప్రస్తుతం వీళ్ళిద్దరి లెజెండరీ కాంబినేషన్ లో ఇంకో సెన్సేషనల్ మూవీ కు ప్లానింగ్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఓ పుకారు షికారు చేస్తోంది. దానికి తోడు ఈ చిత్రం కోసం ఏకంగా నలుగురు ప్రఖ్యాత నిర్మాతలు పోటీ పడుతున్నారట. మరి కాంపిటీషన్ ఏ లెవెల్ లో ఉందో ఊహించండి. ఇంతకీ ఆ నలుగురు నిర్మాతలు ఎవరా అని అనుకుంటున్నారా.. ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, సూర్యదేవర నాగవంశీ, రామ్ ఆచంట మరియు సుధాకర్ చెరుకూరి ఈ రేస్ లో మందంజలో ఉన్నారు. మరి వీళ్లల్లో ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో , బాలయ్య వీళ్ళల్లో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు తెలియాలంటే వేచి చూడాలి.