“భీమ్లా నాయక్” టీజర్ లో రాణాని తప్పించి పవన్ ని మాత్రమే ఎందుకు హైలైట్ చేసారో తెలుసా ?

“భీమ్లా నాయక్” టీజర్ లో రాణాని తప్పించి పవన్ ని మాత్రమే ఎందుకు హైలైట్ చేసారో తెలుసా ?

by Sunku Sravan

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’ ఈ సినిమా లో దగ్గుబాటి రాణా విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..! ఇటీవలే ఆగష్టు 15 న ఈ చిత్రం ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్. ఈ టీజర్ కి భారీ స్పందన రావటం తో పాటుగా యూట్యూబ్ లో పలు రికార్డులని సొంతం చేసుకుంది. అంతే కాదు చాల కాలం తరువాత పవన్ ని ఒక మాస్ పాత్ర లో చూసుకొని మురిసిపోతున్నారు.

Video Advertisement

bheemla nayak first look

bheemla nayak first look

అయితే మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ లో ఎక్కడ రాణా ని చూపించకపోయే సరికి ఫాన్స్ నిరాశ చెందారు. ఇదే ప్రశ్న సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ ప్రొడ్యూసర్స్ ని అడగగా ఇదంతా ఒక పద్ధతి ప్రకారం వెళుతుందంటూ సమాధానం కూడా ఇచ్చారు. అయితే టీజర్ ట్రైలర్ లో పవన్ మాత్రమే హై లైట్ చేయడానికి గల కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, అయన ఫాలోయింగ్ ని ఉపయోగించుకొని పవన్ పాపులారిటీ ని కాష్ చేసుకోవాలనే ఆలా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

bheemla-nayak-stills

bheemla-nayak-stills

కానీ ఇదే విషయం రానా తో కూడా సంప్రదించి, అయన కూడా దీనికి అంగీకరించిన తరువాతే నిర్మాతలు ఇలా చేసారని చెబుతున్నారు. కానీ ఈ సినిమాలో ఇద్దరికీ సమానంగా వారి క్యారెక్టర్లు ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమా ని జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. థమన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలని అందించనున్నారు.


End of Article

You may also like