అందరు దైవ సాక్షిగా అని ప్రమాణం చేస్తే…సీతక్క మాత్రం ఏమని ప్రమాణం చేసారంటే.?

అందరు దైవ సాక్షిగా అని ప్రమాణం చేస్తే…సీతక్క మాత్రం ఏమని ప్రమాణం చేసారంటే.?

by Harika

Ads

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు సహ మంత్రులు అంతా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరూ కూడా దైవ సాక్షిగా తమ ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నట్టు చెప్పి ప్రమాణస్వీకారాన్ని చదివారు.

Video Advertisement

కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం దైవసాక్షి అని కాకుండా, పవిత్ర హృదయంతో అని చెబుతూ ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దనసరి అనసూయ అలియాస్ సీతక్క కూడా పవిత్ర హృదయంతో అని ప్రమాణస్వీకారం చేశారు.

public response for seethakka oath

అయితే వీరందరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ దామోదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, “రేవంత్ రెడ్డి అనే నేను” అని అనడంతో ఎల్పీ స్టేడియం మొత్తం మోత మోగిపోయింది. తర్వాత కొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎనిమిదవ మంత్రిగా సీతక్క వచ్చారు. సీతక్కని చూసిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొట్టారు. సీతక్క అందరికీ అభివాదం చేశారు.

public response for seethakka oath

ఆ తరువాత గవర్నర్ తమిళిసై వచ్చి, “తమిళిసై అనే నేను” అని అన్నా కూడా అక్కడ ప్రజల అరుపులు ఏమాత్రం తగ్గలేదు. దాంతో సీతక్క మళ్ళీ వచ్చి అభివాదం చేశారు. అప్పటికే ఆలస్యం అవుతుండడంతో గవర్నర్ జోక్యం చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలి అన్నట్టుగా సైగ చేశారు. దాంతో సీతక్క వచ్చి, “దనసరి అనసూయ సీతక్క అనే నేను” అన్నారు.

public response for seethakka oath

ఇలా చెప్పిన తర్వాత అంతా అరుపులతో హోరెత్తిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి కంటే, సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రజల అరుపులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇది చూసిన వారు అందరూ కూడా, “బాహుబలి రేంజ్ లో సీతక్కకి అభిమానులు ఉన్నారు. సీతక్క ప్రమాణస్వీకారం చూస్తూ ఉంటే బాహుబలి సినిమాలో అమరేంద్ర “బాహుబలి అనే నేను” అంటూ ప్రభాస్ చేసే సీన్ గుర్తొచ్చింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై గెలిచిన ఓ రోజు కూలి…ఇది కదా గెలుపంటే.?


End of Article

You may also like