సెలబ్రిటీ కుటుంబమైనా అశ్విని పునీత్ కలిసిపోతూ ఒదిగిపోయింది..!

సెలబ్రిటీ కుటుంబమైనా అశ్విని పునీత్ కలిసిపోతూ ఒదిగిపోయింది..!

by Megha Varna

Ads

మనిషి తత్వం బట్టి ప్రతిదీ ఉంటుంది. కొందరు జీవితంలో సర్దుకుపోయి.. అణిగిమణిగి ఉంటారు. మరి కొందరు ఏ మాత్రం సర్దుకోలేక బంధాన్ని కూడా తెంచేసుకోడానికి సిద్ధమైపోతారు. ముఖ్యంగా సెలబ్రిటీల కుటుంబంలో సర్దుకు ఉండిపోవడం అంత సులువు కాదు. చాలా మంది సెలబ్రెటీలు విడిపోయారు.  కానీ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రేవనాధ్ ది మామూలు కథ కాదు.

Video Advertisement

పునీత్ పరిచయం అయ్యేటప్పటికి ఆమె కేవలం తన చదువు పూర్తి చేసుకుని అంతే. పునీత్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. పునీత్ కి మరియు అశ్విని కి కామన్ గా ఉండే స్నేహితుల ద్వారా పరిచయం అయ్యింది. అశ్వినికి సినిమాలంటే అంత ఇష్టం లేదు. ఎక్కువగా చూసేది కూడా కాదు.

పునీత్ ఫ్యామిలీ గురించి కూడా ఆమెకు ఏమాత్రం తెలియదు. అయితే అనుకోకుండా వీళ్ళకి పరిచయం అవ్వడం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మాట్లాడటం జరిగింది. అప్పట్లో ఆమె పునీత్ ని స్టార్ లాగ చూడలేదు కేవలం ఆమెకి తెలిసిన లోహిత్ లాగే ఆమె చూసేది. దాదాపు ఏడెనిమిది నెలలు ప్రేమలో ఉన్నారు వీళ్ళు. పునీత్ కి వీళ్ళిద్దరి మధ్య వున్నది ఆకర్షణ కాదని మంచి ప్రేమ అని తెలుసు.

ఇంక పునీత్ తన తండ్రి దగ్గరికి వెళ్లి ఒక మాట చెప్పాలి అని అన్నాడు. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఇండస్ట్రీ తో సంబంధం లేదు. నేను పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రి వద్దకు వెళ్లి చెప్పాడు. వెంటనే అతను నవ్వి… మీ అమ్మకి చెప్పు ఆమెకు సరే అంటే నేను కూడా ఒప్పుకుంటాను అని బదులిచ్చారు. అమ్మ అంటే అందరికీ చదివే కదా ముఖ్యంగా చిన్న కొడుకులకి అమ్మతో ఎక్కువ చనువు ఉంటుంది.

 

ఇంక ఏమి ఆలోచించకుండా తన తల్లికి చెప్పాడు. తన తల్లి కూడా ఒప్పుకుంది. పెళ్లి అయిపోయింది. అశ్విని ఎప్పుడూ కూడా పునీత్ ని ఎంతో బాగా చూసుకుంటుంది. పైగా ఇబ్బందులు కూడా ఆమె పడలేదు. ఎవరిని ఇబ్బంది కూడా పెట్టలేదు. ఆమె అత్తింట్లో అడుగుపెట్టిన నాటికి ఉమ్మడి కుటుంబంలో 30 మంది. చాలా సందడిగా కుటుంబమంతా ఉండేది.

ఆ కుటుంబంలో ఈమె కలిసి పోవడం నేర్చుకుంది. ఎంతో చక్కగా కుటుంబంలో ఆమె కలిసిపోయింది. పునీత్ కాస్ట్యూమ్స్ ని ఆమె చూసుకునేది. అలానే సొంతంగా వ్యాపార సంస్థ కూడా ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని ఆమె వదిలిపెట్టలేదు. నిజంగా ఇటువంటి ఇల్లాలు గురించి చెప్పుకొని తీరాలి. నిజంగా ఒక సెలబ్రిటీ ఇంట్లో ఇలా సర్దుకుంటూ ఆనందంగా ఉండటం అంత సులభం కాదు.


End of Article

You may also like