“పునీత్” కళ్ళతో నలుగురికి కంటి చూపు వచ్చింది..! ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..?

“పునీత్” కళ్ళతో నలుగురికి కంటి చూపు వచ్చింది..! ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..?

by Megha Varna

Ads

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తీరని లోటు. పునీత్ రాజ్ కుమార్ తన కళ్ళని డొనేట్ చేశారు. అది కూడా ఎంతో మంచి పద్ధతిలో. నారాయణ నేత్రాలయం డాక్టర్లు ఆయన రెండు కళ్ళని నలుగురు యువతులకి ఉపయోగించడం జరిగింది. అయితే వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒకరు అమ్మాయి. పునీత్ బతికి ఉండగానే ఎన్నో సేవా కార్యక్రమాలను చేసారు. ఆయన మరణించాక కూడా.. నేత్ర దానం చేసి నలుగురికి కంటిచూపుని ప్రసాదించారు.

Video Advertisement

punith 1

సాధారణంగా కళ్ళని దానం చెయ్యడం గురించి విన్నప్పుడు రెండు కళ్లతో ఇద్దరికీ చూపు ఇవ్వచ్చు అనుకుంటాం. ఒకరికి ఒక కన్నుని ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. కానీ ఇది మాత్రం అడ్వాన్సు పద్ధతి. కంటి చూపుని తీసుకు రావడానికి అడ్వాన్స్ పద్దతిని వాడారు.

punith eyes 1

ఇక్కడ ఒక కన్నుని ఇద్దరు పేషెంట్లకు ఉపయోగించారు. సుపీరియర్ మరియు డీపర్ లేయర్ ని విడదీసి దీనిని పూర్తి చేయడం జరిగింది. రెండు కళ్ళలో ఉండే సుపీరియర్ లేయర్స్ ని ఇద్దరు మనుషులకి ఉపయోగించి… కంటి చూపుని తిరిగి తీసుకొచ్చారు. ఇంకో ఇద్దరు పేషెంట్ల కి రెండు కళ్ళలోని ఇన్నర్ పార్ట్ ని ట్రాన్స్ప్లాంట్ చేసి కంటి చూపును తిరిగి తీసుకు వచ్చారు.  ఇది నిజంగానే మెడికల్ హిస్టరీ లో ఓ అద్భుతం. గతం లో ఒక వ్యక్తి కళ్ళ నుంచి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కంటిచూపుని ప్రసాదించగలిగేవారు. కానీ ప్రస్తుతం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమైంది.

punith eyes 2

ఇదే కాకుండా రెండు కళ్ళల్లో తెల్లటి భాగాన్ని Induced pluripotent stemcells ప్రొడ్యూస్ చేయడానికి ల్యాబ్ కి పంపించారు. మామూలుగా అయితే దీనిని ఉపయోగించరు. కానీ దీనిని ల్యాబ్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇది లింబల్ స్టెమ్ సెల్స్ లోపం, కెమికల్ ఇంజరీస్, యాసిడ్ బర్న్స్ మొదలైన సీరియస్ డిసార్డర్స్ కి ఉపయోగిస్తారు.


End of Article

You may also like