Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
కన్నడలో పవర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న పునీత్ ను కన్నడ సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసింది మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథేనట. టాలీవుడ్ లో రవితేజ హీరోగా వచ్చిన “ఇడియట్” సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రవితేజకు ఎక్కడలేని ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది. అయితే.. ఈ సినిమాను తెలుగులో కంటే ముందే.. కన్నడలో పూరి జగన్నాధ్ తెరకెక్కించారట. “అప్పు” పేరుతో పునీత్ ను హీరో గా పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారట.
ఏప్రిల్ 2002 లో కన్నడనాట “అప్పు” విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో పునీత్ రాజ్ కుమార్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా తరువాత పునీత్ కు చాలా అవకాశాలు వచ్చాయి. అలా కొన్ని తెలుగు సినిమాలను కూడా కన్నడలో రీమేక్ చేసి.. కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ఇమేజ్ ను పునీత్ సంపాదించుకున్నారు. అదే ఏడాది ఆగష్టు 22 న అదే స్టోరీ తో “రవితేజ” ను హీరోగా పెట్టి “ఇడియట్” సినిమాను రిలీజ్ చేసారు. తెలుగునాట కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
పునీత్ రాజ్ కుమార్ కన్నడలో 29 సినిమాలు చేసారు. కన్నడలో ప్రముఖ సినీ దిగ్గజం రాజ్ కుమార్, పార్వతమ్మల మూడవ కుమారుడుగా పునీత్ జన్మించారు. తక్కువ సమయంలోనే పునీత్ ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలతోనే కాదు సేవాపరంగా కూడా పునీత్ చేసిన సేవలు అన్ని ఇన్ని కావు. అందుకే ఇంత చిన్న వయసులో పునీత్ చనిపోవడాన్ని అటు కన్నడ ప్రజలు, ఇటు తెలుగు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
End of Article