ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఎందుకంటే ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

Video Advertisement

పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 2: ది రూల్’ విడుదల తేదీని రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సుకుమార్ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తిచేయలేదు. కేవలం 40శాతం మాత్రమే షూటింగ్ ఇప్పటికి పూర్తయ్యింది.

ఈ ఏడాది చివరికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తకావాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ పూర్తవ్వడం కొంచెం కష్టంగానే ఉన్నట్టు ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ది రైజ్‌కి కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. కాస్త లేటుగానే సుకుమార్ షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్.

ఈ ఏడాది ఏంటి వచ్చే ఏడాది వేసవి సెలవులకి అయిన సినిమా షుటింగ్ పూర్తయిన ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇదివరకు సినిమా తొందరగా పూర్తి చేయమని చెప్పిన బన్నీ.. నేషనల్ అవార్డుతో ఇంకా లేటు అయిన పర్లేదని సుకుమార్‌కి చెప్పాడట. సుకుమార్ వచ్చే ఏడాది ఆగస్టు 15న అయిన సినిమా థియోటర్ల‌లో చూపిస్తాడో లేదో చూడాలి.