టాలీవుడ్ లో టాప్ స్థాయిని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా చిత్రాన్ని అటెంప్ట్ చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్పలో టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 చిత్రీకరణ చివరి దశలో ఉంది.

pushpa first single

pushpa first single

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈరోజు దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పుష్పకు సంబంధించి మొదటి అప్డేట్ ను ఇచ్చారు.

SUKUMAR : దర్శకుడు సుకుమార్ కు ఏమైంది…? “పుష్ప” షూటింగ్ ఎందుకు ఆగిపోయింది..?

పుష్ప మొదటి సింగిల్ ను ఆగష్టు 13న విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ ను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఒక్కో భాషలో ఒక్కో సింగర్ ఈ పాటను పాడాడు. “దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతుంది పీక” సాంగ్ ను తెలుగులో శివమ్ పాడాడు. హిందీలో విశాల్ దద్లాని, కన్నడలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళ్ లో బెన్నీ దయాల్ ఈ సాంగ్ ను పాడారు.

ఈ పాటతో పుష్ప ప్రమోషన్స్ కు తెర తీసారని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.