Ads
పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లో చేరిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 360 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్‌గా పుష్ప నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు భారీగా లాభాలను మిగిల్చింది.
Video Advertisement
సుకుమార్ దర్శకత్వం లో గతం లో వచ్చిన సినిమాలన్నింటి లోకి ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ మూవీ గా నిలిచింది. అల్లు అర్జున్ కి సాధారణం గానే కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ 18 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. గత ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాగా నిలిచింది. మలయాళంలో అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను పుష్ప రెట్టింపు చేసింది.
అయితే పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరం అయిన సందర్భంగా మరోసారి కేరళలో రీ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 17ను రీ రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అధిక సంఖ్యలో స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ 17ను రీ రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అధిక సంఖ్యలో స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్పెషల్ టీజర్‌ను డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. పార్ట్ వన్‌లో ఉన్న క్యారెక్టర్స్‌తో పాటు మరికొన్ని కొత్త పాత్రలు సీక్వెల్‌లో కనిపిస్తాయని సమాచారం.
End of Article