కేశవ కోసం 15 లక్షల ఖర్చు పెట్టిన పుష్ప టీం… ఎందుకు అంటే…

కేశవ కోసం 15 లక్షల ఖర్చు పెట్టిన పుష్ప టీం… ఎందుకు అంటే…

by Mounika Singaluri

పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ భండారి. మచ్చ మచ్చ అంటూ సినిమా మొత్తం అల్లు అర్జున్ పక్కనే ఉంటూ నవ్విస్తూ సపోర్ట్ చేస్తూ మంచి నటన కనబరిచాడు.

Video Advertisement

అయితే జగదీష్ పుష్ప పార్ట్ 2 లో కూడా భాగమై ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు కూడా. పుష్ప 2 సినిమాలో జగదీష్ పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. అయితే ఇటీవల ఈ నటుడు ఒక పోలీస్ కేస్ లో ఇరుక్కున్నాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ జగదీష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది.

తనకి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని, తన పర్సనల్ ఫోటోలు దగ్గర పెట్టి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని సూసైడ్ చేసుకుంది. అమే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు జగదీష్ జైల్లో ఉండడం వల్ల పుష్ప2 షూటింగ్ నిలిచిపోయింది. ఈ కారణంగా కీలక సన్నివేశాలు షూటింగ్ పెండింగ్ లో పడిపోయాయి. జగదీష్ బయటకి వస్తే తప్ప అవి షూట్ చేసే అవకాశం లేకపోవడంలో చేసేదేం లేక పుష్ప టీం 15 లక్షలు ఖర్చుపెట్టి జగదీష్ కి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకు వచ్చారు. దీనివల్ల ఇంపార్టెన్స్ సీన్స్ షూటింగ్ అంత కూడా ఒకేసారి పూర్తి చేయాలని టీం డిసైడ్ అయిందట


You may also like

Leave a Comment