“పుష్ప” సినిమాలో సెన్సార్ కి కట్ అయిపోయిన సన్నివేశాలు ఇవే.. ఓ లుక్ వేయండి..!

“పుష్ప” సినిమాలో సెన్సార్ కి కట్ అయిపోయిన సన్నివేశాలు ఇవే.. ఓ లుక్ వేయండి..!

by Anudeep

Ads

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

pushpa censor

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అనే విషయం తెలిసిందే. మొదటి భాగమైన పుష్ప – ది రైజ్ డిసెంబర్ 17వ తేదిన విడుదల అవ్వబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఒక సినిమా పూర్తి అయ్యాక సెన్సార్ బోర్డు వారు చూసి అభ్యంతరంగా ఉన్న సీన్లను తొలగిస్తారు. క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతే.. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించడానికి వీలు అవుతుంది.

pushpa censor 2

పుష్ప సినిమాకు కూడా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ వారు కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని మ్యూట్ చేసి.. యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారు. కొన్ని సీన్స్ ను బ్లర్ చేసారు.. మరికొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేసారు. అవేంటో ఇప్పుడు చూడండి.

pushpa censor 3

# మద్యం సేవించేటపుడు “మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం.” అన్న టైటిల్స్ ను ప్రతి సినిమాకి వేస్తారు. అలాగే.. కొన్ని బ్రాండ్స్ ను కనిపించకుండా బ్లర్ చేస్తారు.

# కొన్ని సన్నివేశాలలో ‘లం*’ ‘లం* కొ*కా’ వంటి మాటలు వచ్చినప్పుడు వాటిని మ్యూట్ చేసారు.

# అలాగే ముం* అనే మాట వచ్చినపుడు కూడా మ్యూట్ చేసారు.

pushpa censor 1

# చెయ్యి నరికిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అలా హింసాత్మక దృశ్యాల సమయం లో కూడా బ్లర్ చేసారు.

# రక్తం ఎక్కువగా కనిపించిన వయొలెన్స్ సన్నివేశాలలో కూడా కొన్ని చోట్ల బ్లర్ చేశారు.

# పుష్ప పోలీసులతో కలిసి మందుపార్టీ లో పాల్గొన్నప్పుడు వచ్చిన బూతు మాటలని కూడా కట్ చేసారు.

# పుష్ప లో చాలా ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే సుకుమార్ కొంత బోల్డ్ గా సన్నివేశాలు పెట్టక తప్పలేదు. అందుకే సెన్సార్ వారు కూడా అవసరమైనంత మేర ఉంచేసి మ్యూట్ చేశారు.


End of Article

You may also like