Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
Video Advertisement
దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ “ఊ అంటావా మావ.. ఊహు అంటావా..” కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటకి సమంత నర్తించడంతో మరింతగా రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ ఒక్క పాట కోసమే దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఒక్క సమంత రెమ్యునరేషనే కోటికి పైగా ఉందని తెలుస్తోంది. ఈ బడ్జెట్ తో ఒక చిన్న సినిమాను తీసేయొచ్చు. అయితే.. ఈ పాటకి వస్తున్న రెస్పాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది మరి.
End of Article