ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

https://www.youtube.com/watch?v=u_wB6byrl5k

సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ప్రస్తుతం ఈ పాట వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతోంది.

https://youtu.be/d779OJTFjYM

అందుకు కారణం ఈ పాట ట్యూన్ ఒక ఫేమస్ పాట ట్యూన్ కి దగ్గరగా ఉండడమే. ఈ పాట కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హీరోగా నటించిన అయాన్ సినిమాలోని ఒక పాటకి దగ్గరగా ఉంది. ఈ సినిమా తెలుగులో వీడోక్కడే పేరుతో డబ్ అయ్యింది. ఇందులో హనీ హనీ అనే ఒక స్పెషల్ సాంగ్ ట్యూన్ కూడా దగ్గర దగ్గర పుష్పలోని స్పెషల్ సాంగ్ ట్యూన్ లాగానే ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.