పుష్ప-2 లో “సాయి పల్లవి” రోల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..? ఏమన్నారంటే..?

పుష్ప-2 లో “సాయి పల్లవి” రోల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..? ఏమన్నారంటే..?

by Anudeep

Ads

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న పుష్ప పార్ట్-2 అయిన పుష్ప-ద రూల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకాబోతుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న మహూరత్ పూజా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

Video Advertisement

పుష్ప సినిమా ఎవరు ఊహించని అంతగా సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంది. ఈ మూవీలో సాంగ్స్ సరికొత్త రికార్డును సృష్టించాయి అనడంలో వింత ఏమీ లేదు.

అయితే ఈ మధ్య కొత్తగా పుష్ప 2 గురించి ఇంకో వార్త వైరల్ అవుతుంది. అదే…పుష్ప: ది రైజ్ సీక్వెల్‌లో సాయి పల్లవి సుకుమార్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంది అన్న విషయం. నివేదికల ప్రకారం, పుష్ప 2: ద రూల్‌లో నటించడానికి దర్శకుడు సుకుమార్ ఆమెను సంప్రదించారని , ఈ చిత్రంలో సాయి పల్లవి ఒక గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుందని సమాచారం. సాయి పల్లవి ఇప్పటికే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపారని. ఇక కేవలం ఆమె రెమ్యూనరేషన్ ఖరారు కావలసి ఉందని, అయిన వెంటనే అల్లు అర్జున్ తో ఆమె నటించే ఈ చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తారని ఊహా గానాలు కూడా ఉన్నాయి.

Famous one liners of telugu heroines

ఈ రాబోయే సీక్వెల్లో తమిళ్ హీరో విజయ్ సేతుపతి మంచి పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. కానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవిశంకర్…పుష్ప 2 అందరిని అలరిస్తుందని, ఇందులో అల్లు అర్జున్ రష్మిక సరికొత్త గెటప్ లో కనువిందు చేస్తారని చెప్పారు. వీరిద్దరి లుక్స్ పార్ట్ వన్ లో లాగే ఉన్నప్పటికీ కొద్ది మార్పులు తో ఇంకా డైనమిక్ గా కనిపిస్తాయని చెప్పారు. అలాగే ఈ చిత్రంలో సాయి పల్లవి నటించబోతున్నట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు.


End of Article

You may also like