Ads
పుష్ప ది రైజ్ మూవీతో సంచలనం సృష్టించడమే కాకుండా నేషనల్ అవార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ది రూల్ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ మూవీ పై ఆసక్తిని రేపాయి. మరి ముఖ్యంగా తిరుపతి గంగ జాతర బ్యాక్ డ్రాప్ లో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ ఫోటో భారీ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
Video Advertisement
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు షూటింగ్స్ అన్ని వేషాలు పూర్తి చేయడం జరిగింది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేపటి నుంచి పుష్ప ది రుల్ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. హైదరాబాదులో జరగనున్న ఈ షూటింగ్ షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట.
అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కోసం కుటుంబ సమేతంగా ఇటలీకి వెళ్లారు. ఇక వెడ్డింగ్ వేడుకలు పూర్తి చేసుకొని అల్లు అర్జున్ రేపో ఎల్లుండో ఇండియాకు తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక బన్నీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ మూవీలో నేషనల్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్ ఫజిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
End of Article