తెలివైన అమ్మాయిలకు ఉండే ఆ 7 లక్షణాలు ఏంటో తెలుసా.?

తెలివైన అమ్మాయిలకు ఉండే ఆ 7 లక్షణాలు ఏంటో తెలుసా.?

by Anudeep

Ads

మనం టీనేజ్ లో ఏ విషయాలు నేర్చుకుంటామో, వేటిని ఇష్టపడతామో అవి మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి.

Video Advertisement

అందుకే టీనేజ్ లో అమ్మాయిలు అందం మీదే దృష్టి పెట్టడం కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా తప్పక నేర్చుకోవాలి. తెలివైన అమ్మాయికి ఉండే ఏడు ప్రధానమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం . .

#1. ఇతరులతో పోల్చుకోవడం:


తెలివైన అమ్మాయిలు ఇతరుతో పోల్చుకొని తమని తాము తక్కువ చేసుకోరు. ఎప్పుడు ఆశావాదా దృక్పథంతో ముందుకు సాగిపోతారు. ఇతరులతో పోల్చుకోవడం అనేది మన కాంఫిడెన్స్ ని తగ్గిస్తుంది.

#2. ఇతరుల ఒపీనియన్ గురించి ఆలోచించొద్దు:


మనకు నచ్చినట్టు మనం ఉండాలి కానీ ఇతరులను ఇంప్రెస్ చేయాలి అని చూడకూడదు. ఇతరుల ఒపీనియన్ కు మన జీవితంలో ఎంత తక్కువ ప్రాధాన్యం ఇస్తే జీవితంలో మనం అంత ముందు వెళ్తాము.

#3. వ్యాయామం:


రోజు అరగంట వ్యాయామం చేయడం వలన మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటాము. మెడిటేషన్ లాంటివి చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేనికి టెన్షన్ పడకుండా కూల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

#4. మనల్ని మనం ధైర్యంగా పరిచయం చేసుకోవాలి:


కమ్యూనికేషన్ స్కిల్స్ అలవార్చుకోవాలి. నలుగురిలో ధైర్యంగా మాట్లాడాలి. మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి సిగ్గు పడకూడదు. దీంతో పాటు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. కనీసం ఆడియో పుస్తకాలు వినడం అయినా చేయాలి.

#5. ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు:


సమయానికి ఆహారం తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. బ్రెయిన్ పవర్ ను పెంచుకోవడానికి పజిల్స్ ప్రాక్టీస్ చేయాలి. మన అలవాట్లే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.

#6. మీకు మీరు నచ్చాలి:


ముందు మీకు మీరు నచ్చాలి ఆ తర్వాతే ఇంకేదైనా. మీకు మీరు టైం కేటాయించుకొని భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి.

#7. కుటుంబాన్ని గౌరవించడం:


ముందు మన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. మనం సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్లలో కుటుంబ సభ్యులు ఎప్పుడు ముందుంటారు. వాళ్ళతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి.


End of Article

You may also like