అమ్మాయిలకి ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు అస్సలు నచ్చరు..! అవేంటంటే..?

అమ్మాయిలకి ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు అస్సలు నచ్చరు..! అవేంటంటే..?

by Harika

Ads

సాధారణంగా ఎవరికి అయినా కూడా వారికి కాబోయే భాగస్వామి మీద కొన్ని అంచనాలు ఉంటాయి. అలాంటి క్వాలిటీస్ ఉన్న వారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని మాత్రం అసలు ఉండకూడదు అనుకుంటారు. అలాంటి లక్షణాలు ఉంటే వారికి దూరంగా ఉంటారు. అలా అమ్మాయిలు కూడా అబ్బాయిల్లో కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళని ఇష్టపడరు. అలాంటి లక్షణాలు ఉంటే పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 qualities that women dont like in men

# బద్ధకం. ఇది ఎక్కువగా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. ఏది చెప్పినా కూడా చేయకుండా, అసలు వాళ్లను పట్టించుకోకుండా ఉన్న అబ్బాయిలని ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దూరంగా ఉంటారు.

# అతిగా జాగ్రత్త తీసుకోవడం. ఓవర్ కేరింగ్. మోతాదుకి మించి ఏది చేసినా కూడా మంచిది కాదు. అవసరానికి మించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది భాగస్వాములకి నచ్చదు. వాళ్ల స్వేచ్ఛని దూరం చేసినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. ఈ లక్షణం అబ్బాయిలకి ఉన్నా, అమ్మాయిలకి ఉన్నా వాళ్ళ భాగస్వాములు మాత్రం ఈ విషయాన్ని ఇష్టపడరు.

# కోపం తెచ్చుకోవడం. చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకోవడం. చిరాకు తెచ్చుకోవడం. అందులో ఏది పడితే అది మాట్లాడేసేయడం. ఇలాంటి లక్షణాలు ఉంటే అమ్మాయిలు భరించలేరు. కేవలం కోపం అనే విషయం వల్ల విడిపోయిన ఎన్నో ప్రేమలు ఉన్నాయి.

# పనులు షేర్ చేసుకోకపోవడం. ఇంటి పని మొత్తం తన మీదే వదిలేసి, హాలిడేస్ లో కూడా ఖాళీగా కూర్చునే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. పనులు షేర్ చేసుకునే అలవాటు ఉంటేనే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు.

# గొప్పలు చెప్పుకోవడం. తమ గురించి తాము కొంత మంది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక సమయం వరకు ఇది బాగానే అనిపిస్తుంది. కానీ తర్వాత వినడానికి చిరాకుగా అనిపిస్తుంది. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని భాగస్వామిగా చేసుకునే ముందు అవతలి వారు ఆలోచిస్తారు.

ఇవి కేవలం కొన్ని మాత్రమే. చిన్న చిన్న వాటికి ఎవరైనా సరే అడ్జస్ట్ అవుతారు. కానీ కొన్నిటి వల్ల ఇబ్బందులు ఉంటే మాత్రం ఆ బంధాన్ని కొనసాగించకపోవడం నయం అనుకుంటారు. అందులో ఈ లక్షణాలు కూడా కొన్ని. ఇలాంటివి ఉంటే అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు ప్రేమించడానికి ఆలోచిస్తారు.


End of Article

You may also like