నందమూరి బాలకృష్ణ యాంకర్ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ విత్ NBK అనే షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎంతో మంది సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చారు. ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఎన్నో విషయాలని ప్రేక్షకులకి చెప్పారు. ఇప్పుడు ఈ షో రెండవ సీజన్ కూడా వచ్చింది. ఇందులో కూడా మొదటి సీజన్ లాగానే ఎంతో మంది ప్రముఖులు వచ్చి మాట్లాడారు.

Video Advertisement

అయితే ఇప్పుడు ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇవాళ జరిగింది. ఆ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రాంలో అసలు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఎటువంటి ప్రశ్నలు అడిగి ఉంటారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇందులో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఇవే ప్రశ్నలు అడిగారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

questions balakrishna asked pawan kalyan in unstoppable with nbk

ఈ ప్రోగ్రాంలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు అని సమాచారం. 2014లో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రశ్నలు అడిగారు అనే వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ కి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగారు అని అంటున్నారు. వాటికి పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారట. అలాగే ఇప్పటి వరకూ తన వ్యక్తిగత జీవితం గురించి పవన్ కళ్యాణ్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు.

questions balakrishna asked pawan kalyan in unstoppable with nbk

ఇప్పుడు ఈ షోలో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కి మధ్య జరిగిన సమస్యల గురించి కూడా బాలకృష్ణ అడిగారు అని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే అంతవరకు ఆగాల్సిందే. అలాగే ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ప్రోగ్రాం లో కాల్ లో మాట్లాడతారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఉన్నారు.