ఏదైనా సినిమాలోని సన్నివేశాన్ని చూసి మీకు ఎప్పుడైనా ఇదే సంఘటన నా జీవితంలో కూడా జరిగిందే అని అనిపించిందా..? ఒక్కొక్కసారి మనకి ఏదైనా సినిమాలో సన్నివేశం కానీ లేదంటే ఎవరైనా చెప్పినప్పుడు కానీ నా జీవితంలో కూడా ఇలాగే జరిగిందబ్బా అని అంటూ ఉంటాము. మీకు కూడా అలా ఏదో ఒకటి జరిగే ఉండి ఉంటుంది. ఈ ప్రశ్నకి ఒక కోరా యూజర్ ఇచ్చిన జవాబు ఇది.

Video Advertisement

”ఒక సంఘటన కాదు చాలాసార్లు నాకు నా జీవితంలో అనిపించింది. సినిమాలో జరిగే సన్నివేశాలు చాలా నా జీవితంలో జరిగాయి.

“ఇష్టం లేకపోయినా కూడా అమ్మ కోసం నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత నాకు ఇష్టమైన గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి సంవత్సరంలోనే ఉద్యోగం తెచ్చుకున్నాను. ట్రైనింగ్ టైం లో గ్రూప్ ల కింద డివైడ్ చేశారు. అప్పుడు ఒక అబ్బాయిని నాతో పాటు వేశారు. తనకి నిజాయితీ ఎక్కువ. నెమ్మది నెమ్మదిగా తన మీద ఉన్న గౌరవం కాస్త ప్రేమగా మారింది. తను ఎక్కువ మాట్లాడేవాడు కాదు. నేను చెప్పాలంటే మా కులం వేరు.. ప్రాంతం కూడా వేరు.. మా ఇంట్లో అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఒప్పుకోరు.”

women crying 2

ఇక నేను ఈ విషయాన్ని మర్చిపోయా ట్రైనింగ్ అయిపోయింది, ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్లిపోయాము. కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడుకున్నాము ఒకరోజు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ అబ్బాయి కోసం నేను వెళ్లలేకపోయాను…. ఇంట్లో చెప్పినట్లు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.  పెళ్లిలో ఆనంద్ సినిమాలో లాగే గొడవలు చేసారు. కానీ ఆ సినిమాలో హీరోయిన్ లాగ నేను పెళ్లి ఆపలేదు. నాకు తప్పలేదు.

why do women in households eat at last

పెళ్లి చేసుకున్నాను రెండు నెలల తర్వాత అమెరికా వెళ్ళిపోయాను. నా భర్త నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు వేరే గదిలో ఉండే వాళ్ళం. ఒకరోజు అడిగాను ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు అని… అప్పుడు అతను నేను అనుకున్నట్లుగా నువ్వు లేవు అని సమాధానం చెప్పాడు. నాకు భార్య అంటే ఐఐటి చదువుకుని ఉండాలి. ఆర్థికంగా నాకంటే బాగా ఉండాలి. కానీ నువ్వు అలా లేవు అని చెప్పాడు. మీకు ముందు తెలియదా అని అడిగాను.

Women who were declared as national crush of India

మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు అని అతను నాకు సమాధానం చెప్పాడు. ఇండియా వచ్చి నేను కేసు పెడతాను ఏమో అని భయపడి ఫోన్ లాప్టాప్ ని తీసేసుకున్నాడు. ఆఫీస్ కి వెళ్లేటప్పుడు బయట తాళం వేసేవాడు. అతను ఉన్నప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళతో మాట్లాడమని చెప్పేవాడు. ఆరు నెలల పాటు నరకం చూసాను. ఒక రోజు ఆయన ఫ్రెండ్ అలానే అతని భార్య మా ఇంటికి వచ్చారు. నా బాధని అర్థం చేసుకునే ఆమె నాలుగు రోజులు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తానని అమెరికాలో ఉండే మా అన్న ఇంటికి తీసుకు వెళ్ళింది.

i found my love after marrigae..

అక్కడి నుండి ఇండియా వచ్చేసాను. తర్వాత విడాకులు కూడా తీసుకున్నాను. 2017 లో ఒక పెళ్ళిలో నేను ప్రేమించిన వ్యక్తి కలిశాను. పెళ్లి అని ఎందుకు చెప్పలేదు అని నన్ను తిట్టాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావ్ అని నేను అడుగుతే ఫోన్ పోయింది ఈమెయిల్ చేశానని చెప్పాడు. అయిందేదో అయిపోయింది పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. నేను వద్దు అని చెప్పాను కానీ వినలేదు అందర్నీ ఒప్పించే పెళ్లి చేసుకున్నాడు” అని ఈ కోరా యూజర్ సమాధానం ఇచ్చారు.