RRR సినిమాలో రాజమౌళి వాడిన ఈ టెక్నిక్ ని గమనించారా..?

RRR సినిమాలో రాజమౌళి వాడిన ఈ టెక్నిక్ ని గమనించారా..?

by Megha Varna

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాలో ఒక చోట పదునైన కత్తిలాంటిది రామ్‌చరణ్‌ గుండెల్లో జూనియర్ ఎన్‌టీఆర్ గుచ్చుతాడు. అయినా, రామ్‌ చరణ్‌ కి ఏమీ కాదు. ఇలాంటి అసాధ్యాలను చూపించినా సినిమా ఎలా హిట్ అయింది?

Video Advertisement

రాజమౌళి సినిమాలు అంటే ఒక లెక్క లో ఉంటాయి. పైగా రాజమౌళి సినిమా తీస్తున్నారు అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అభిమానులు పైగా రాజమౌళి తో సినిమా చేయడం చాలా మంది హీరోల కల.

రీసెంట్ గా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఒక చోట పదునైన కత్తిలాంటిది రామ్‌చరణ్‌ గుండెల్లో జూనియర్ ఎన్‌టీఆర్ గుచ్చుతాడు. అయినా, రామ్‌చరణ్‌కి ఏమీ కాదు. ఈ ప్రశ్నకి కోరా యూజర్ చెప్పిన సమాధానం ఇదే.

మహేంద్ర బాహుబలి అంత ఎత్తు లో వుండే జలపాతం మీదకి సులువుగా ఎక్కేస్తాడు. అలానే ఒక్కరు ఎత్తలేని శివలింగాన్ని ఈజీగా ఎత్తేస్తాడు మహేంద్ర బాహుబలి. ఎలా సులువుగా ఎత్తేస్తాడు అనేది చూస్తే.. అమరేంద్ర బాహుబలి కొడుకు కాబట్టి అలా చేయగలిగాడని చెప్పచ్చు.

అలానే చిన్న కొండంత అడవి దున్నకు రక్తం కక్కిస్తాడు భళ్లాలదేవ. అయితే రాజు కాబట్టి సులభంగా అడవి దున్నకు రక్తం కక్కించాడు అని చెప్పచ్చు. అంతకు ముందు వచ్చిన ఛత్రపతి సినిమాలో అయితే సొర చేపల తో ఫైట్ చేస్తాడు హీరో. తల్లి గన్నుతో కాల్చినా లేచి విలన్ను కొలిమి లోకి విసిరేస్తాడు హీరో.

అలానే కాలేజీ కుర్రాడు పృథ్వి కి ఎముకు విరిగి పోయినా సరే కూలిపోకుండా లేచి ఫైట్ చేస్తాడు. యమదొంగ లో రాజేమో కొండపై  నుండి పడి రెండు గుప్పిళ్ళు రక్తం కక్కి ఫైట్ చేస్తాడు. అయితే రాజమౌళి సినిమాల్లో ” హీరో, విలన్ల చేష్టలకు సాధ్యాసాధ్యాలుండాలనుకోవటం అత్తా కోడళ్ళు పాలు నీళ్ళలా సామరస్యంగా కలిసుండాలని కోరుకోవటం” అని ఒక కోరా యూజర్ చెప్పారు. అలానే నిజానికి బోయపాటి, మెహర్ వంటి గొప్ప సృజనకారులకంటే అద్భుతాలేం కావివన్నీ కోరా యూజర్ అన్నారు.


You may also like