Ads
ఒక ప్రశ్నకి ప్రపంచం మొత్తంలో ఎక్కడి నుంచైనా సమాధానం దొరికే చోటు కోరా. ఇందులో ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు పోస్ట్ చేస్తే, దానికి ఎంతో మంది తాము ఏం అనుకుంటున్నాం అనేది వ్యక్తపరుస్తారు. అయితే తాజాగా కోరా లో “అత్తగారు ఎప్పటికీ అమ్మ కాలేరా..??” అన్న ప్రశ్న ఒకరు పోస్ట్ చేయగా.. దానికి ప్రత్యూష ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
Video Advertisement
“తల్లిదండ్రులకి పిల్లలకి ఉండే బంధం ఆత్మీయత తో ముడిపడిన.. అతీతమైన బంధం. పిల్లల జీవితం లో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. అలాంటి తల్లిదండ్రుల స్థానం అత్తమామలు కాదు కదా భార్య భర్త కూడా తీసుకోలేరు. ఎవరైనా తల్లిప్రేమ లాంటి ప్రేమ, తండ్రి లాలన లాంటి ఆప్యాయత పంచగలరేమో కానీ ఎవరూ కూడా తల్లిదండ్రులు కాలేరు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఏం అశించక పెంచిన ఆ బంధంతో వేరే ఏ బంధం పోటీ పడలేదు.
నేను పదేళ్లుగా అత్తమామలతో కలిసి ఉన్నాను. ఒకటి అర తప్పించి మాటలు విభేదాలు వచ్చింది కూడా లేదు. అయినా కూడా మా బంధం అత్త కోడళ్ళ బంధమే. ఒక ఆత్మీయ అనుబంధం. మా నాన్న నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. మా వారు నన్ను మా నాన్న చూసుకున్న దానికన్నా బాగా చూసుకుంటారు. అయినా మా నాన్న లేని లోటు నాకు అలానే ఉంటుంది. ఏ బంధం దానికదే ప్రత్యేకం. ఒక బంధం లో రెండు వైపులా సహకారం, సర్దుబాటు అవసరం. ఎక్కువ తక్కువలు, వయసు వ్యత్యాసాలు, ధనం, స్థాయి బేధాలు పట్టించుకోకుండా ఉండే మానసిక పరిపక్వత. అది ఏ ఒక్కవైపు నుండి లేకపోయినా కన్న వాళ్ళు, సొంత వాళ్ళు కూడా పరాయి కిందే లెక్క.” అని ప్రత్యుష కోరా లో సమాధానం ఇచ్చారు.
సాధారణంగా ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం..కోడలు ఇంటికి వచ్చినప్పటి నుండి కొడుకులు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అత్తలకు అనిపిస్తుంది. అది నిజం కాకపోయినా వారు అలాగే ఫీల్ అవుతారు. ఒకప్పుడు తల్లి చెప్పిన మాట విన్న కొడుకు పెళ్లాయ్యాక భార్య చెప్పే మాటే వింటున్నాడు, కోడలు చెప్పినట్టే చేస్తున్నాడు అనుకుంటారు అత్తలు. అలా కోడళ్లు అంటే అత్తలకు ఈర్శ్య, అసూయ మొదలవుతుంది. అది కాస్త కోపం రూపంలో ప్రదర్శిస్తారు. ఇంకా ఇంటి పనుల విషయం లో కూడా ఈ కోపం అటు వైపు మళ్లుతుంది. దీంతో ఇంట్లో శాంతి నశిస్తుంది.
End of Article