Ads
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు హీరో రానా దగ్గుబాటి. హీరోయిజం అని కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వివిధ రకాల కథలని ఎంచుకుంటూ తన లోని నటుడుని ప్రూవ్ చేసుకున్నాడు రానా. ప్రతినాయకుడిగానూ మెప్పించిన రానా.. ప్రస్తుతం రానానాయుడు వెబ్ సిరీస్‌లో బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ మార్చి 10న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Video Advertisement
అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రానా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా తాజాగా సమంత ఆరోగ్యం గురించి స్పందించారు. జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదంటూ రానా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
“సమంత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే నేను ఆమెను సంప్రదించాను. మేము ఎప్పుడూ మాట్లాడుకుంటాము. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది ఒకటి ఉంటుంది. అది ఆరోగ్య సమస్య కూడా కావచ్చు. అలాంటి సమయంలో మనం ఎలా వ్యవహరిస్తాము.. దాని గురించి ఎలా స్పందిస్తామనే దానిపై జీవవితం ఆధారపడి ఉంటుంది. జీవితం లో అప్పుడప్పుడు విచారించే విషయాలు జరగడం కూడా ముఖ్యమే. ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి ముందుకు సాగడమే ముఖ్యం” అంటూ రానా చెప్పుకొచ్చారు.
అయితే రానా కి కూడా చిన్నప్పటి నుంచి బీపీ ఉంది. దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుంది.. నీ కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశం ఉంది అని రానా గతం లో ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఇక మరోవైపు రానా ఇటీవల చేసిన సినిమాలన్నీ ఫ్లాపుల బాట పడుతున్నాయి. నే రాజు నేనే మంత్రి తర్వాత సరైన ప్రాజెక్ట్ ఎంచుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఇటీవల రానా అరణ్య, విరాటపర్వం అంటూ చేసిన ప్రయోగాలు పూర్తిగా బెడిసికొట్టాయి.
End of Article