Ads
చంద్రముఖి. అప్పట్లో వెన్నుపూసలో వణుకు పుట్టిస్తూనే అలరించి, మెప్పించిన సినిమా. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన మనిచిత్రతళు అనే మూవీకి రీమేక్ గా పీ. వాసు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి.
Video Advertisement
పార్ట్ 1 ఎంత ఘన విజయం సాధించిందో,ప్రస్తుతం తియ్యబోయే చంద్రముఖి -2 కూడా అంతే సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని వేచి చూస్తున్నారు.
అయితే చంద్రముఖి పార్ట్ -1 లో సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించారు. అందులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో భాగంగా రజినీకాంత్ ఒక కర్కషమైన రాజుగా, చంద్రముఖి అనే యువతిని వశపరుచుకోవడానికి ఆమె ప్రియున్ని చంపేస్తే ఆ రివేంజ్ తీర్చుకోడానికి చంద్రముఖి మళ్లీ వచ్చింది అనే నేపథ్యంలో కథ అల్లుకోగా… జ్యోతిక నటించిన గంగ పాత్ర అంటే చంద్రముఖి తనలోకి వచ్చిందనే బ్రమలో సైకలాజికల్ డిసార్డర్ ఉన్న వ్యక్తిని రజినీ కాంత్ ఎలా కాపాడుతాడు, గంగ రివేంజ్ ను ఎలా కవర్ చేస్తారు అనే అంశాన్ని అందరూ కట్టి పడేసేలా ప్రదర్శించారు దర్శకులు పీ.వాసు.
ఇప్పుడు చంద్రముఖి పాత్రకు సీక్వెల్ గా రెండో భాగంలో, పార్ట్ -1 లో రజినీకాంత్ చేసిన పాత్రకు… క్రూరమైన వెట్టియన్ రాజు పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఈ పార్ట్ 2 కథను డైరెక్టర్ రివీల్ చేయగా…ఆయన చెప్పింది ఏంటంటే!! చంద్రముఖి మంచి సక్సెస్ తో నడిచింది కాబట్టి వెట్టియాన్ రాజుకి చంద్రముఖి కి మధ్య ఉన్న శతృత్వం ఎలా ఉండేదో, వాళ్ళ గతమేంటో ఈ పార్ట్ -2 ద్వారా చూపించాలి అనుకున్నారట.
అయితే ఈ కథకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ పూర్తి చేసినప్పటికీ… ఇందులో నటీనటుల పాత్రలు ఇంకా రీవీల్ చెయ్యలేదు. మొత్తంగా ఈ సినిమా మొదటి భాగం ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, ఇప్పటికి కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే చంద్రముఖి పార్ట్ -2 పై అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి.
ALSO READ : “భోళా శంకర్” ఇన్‌సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?
End of Article