• చిత్రం : రుద్రుడు
 • నటీనటులు : రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్.
 • నిర్మాత : కదిరేసన్
 • దర్శకత్వం : కదిరేసన్
 • సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
 • విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

rudhrudu movie review

Video Advertisement

స్టోరీ :

రుద్రన్ (రాఘవ లారెన్స్) తన తల్లి కోసం ఏమైనా చేస్తాడు. కార్పొరేట్ వ్యవస్థలో చాలా పేరు ఉన్న భూమి (శరత్ కుమార్) తో రుద్రన్ కి గొడవ అవుతుంది. ఆ తర్వాత రుద్రన్ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారిద్దరికీ ఉన్న గొడవలో రుద్రన్ తన కుటుంబ సభ్యులను కోల్పోతాడు. ఆ తర్వాత రుద్రన్ ఏం చేశాడు? తన కుటుంబాన్ని తనకి దూరం చేసిన వారిపై పగ ఎలా తీర్చుకున్నాడు? అసలు వారిద్దరికీ మధ్య గొడవ ఏంటి? భూమి ఇలా ఎందుకు చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

rudhrudu movie review

రివ్యూ :

కొరియోగ్రాఫర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న తర్వాత, దర్శకుడిగా అలాగే నటుడిగా కూడా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో చాలా పాపులర్ అయిన వ్యక్తి రాఘవ లారెన్స్. రాఘవ అంటే జనరల్ గా కాంచన సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు లారెన్స్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా కథ చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.

rudhrudu movie review

హీరోకి సమాజంలో పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తితో గొడవ అవడం, ఆ గొడవలో భాగంగా ఆ వ్యక్తి హీరో కుటుంబాన్ని సమస్యల్లోకి పడేయడం, హీరో తన కుటుంబాన్ని కోల్పోవడం, ఆ తర్వాత హీరో ఆ వ్యక్తిపై పగ తీర్చుకోవడం. ఇలాంటి టెంప్లేట్ ఉన్న సినిమాలు మనం ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఇది కూడా అలాంటి ఒక సినిమా.

rudhrudu movie review

సినిమా మొత్తంలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉన్న పాత్ర విలన్ పాత్ర పోషించిన శరత్ కుమార్ పాత్ర. కానీ సినిమాలో చాలా చోట్ల శరత్ కుమార్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సీన్స్ కానీ ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు ఏమో అనిపిస్తుంది. పాటలు చూడడానికి బాగానే ఉన్నాయి. లారెన్స్ డాన్స్ బాగుంది. కానీ కథ మాత్రం ఒక్కచోట కూడా ఆసక్తికరంగా అనిపించదు.

ప్లస్ పాయింట్స్ :

 • లారెన్స్
 • పాటలు

మైనస్ పాయింట్స్:

 • రొటీన్ కథ
 • కొన్ని యాక్షన్ సీన్స్
 • చాలా ల్యాగ్ అయిన కొన్ని ఎపిసోడ్స్
 • బలహీనమైన టేకింగ్

రేటింగ్ :

1.5/5

ట్యాగ్ లైన్ :

కొత్తదనం లేని స్టోరీ ఉన్నా పర్వాలేదు, మనం అంతకుముందు ఇలాంటి సినిమాలు చాలా చూసినా పర్వాలేదు, కేవలం లారెన్స్ కోసం ఈ సినిమా చూద్దాం అని అనుకునే వారికి రుద్రుడు యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :