తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు..కమర్షియల్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, ప్రేమకథలు ఆఖరికి భక్తిరస చిత్రాలు అన్ని రకాల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత రాఘవేంద్రరావు సొంతం..అన్ని రకాల చిత్రాలు తీసినప్పటికి, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నప్పటికి రాఘవేంద్రరావు అనగానే అందరికి గుర్తొచ్చేది హీరోయిన్లు-పాటలు-పండ్లు అనే కాన్సెప్టే..

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటల్లో ఎక్కువగా పండ్లను ఉపయోగిస్తారనేది టాక్..ఆఖరికి కొబ్బరికాయను కూడా వదల్లేదు ఝుమ్మందినాదం సినిమాలో.. ఆ సినిమాలో నటించిన తాప్సీ ..  బాలివుడ్ కి వెళ్లిన తర్వాత ఆ విషయంలో కామెంట్స్ చేసింది అది వేరే విషయం..

ఇది ఇలా ఉండగా…”నేను సినిమాల్లో పండ్లను ఉపయోగించింది యాభై సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత..కానీ అందరూ నా ప్రతి సినిమాలో ఆ కాన్సెప్ట్ వాడినట్టుగా చెప్తుంటారు అని అన్నారు.” అని ఒక ఇంటర్వ్యూ లో రాఘవేంద్ర రావు గారు అన్నారు. అయితే ఆయన హీరోయిన్స్ పై పండ్లు వేయడం చిరంజీవి, విజయశాంతి, సుహాసిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘మంచి దొంగ’ సినిమాతో మొదలైంది. ‘బెడ్ లైట్ తగ్గించనా’ అనే పాటలో తొలిసారి విజయశాంతి పై పండ్లు వేసారు రాఘవేంద్రరావు. ఈ పాటకు చక్రవర్తి అద్భుతమైన సంగీతం అందించారు.

watch video: