ఏ ఇండస్ట్రీలో అయినా రాణించాలంటే ముఖ్యంగా ఉండాల్సింది అందం. ఇది హీరోయిన్లకు అయితే మరి ఇంపార్టెంట్.

Video Advertisement

వారు ఎంత గ్లామర్ గా ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయి. ఇక గ్లామర్ కు తోడుగా కాస్త నటనా చాతుర్యం ఉంటే వారికి సినీ ఇండస్ట్రీలో తిరుగుండదు.

raghuvaran btech actress amala paul latest look goes viral

అలాంటి నటులే ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఇక అమలా పాల్ విషయానికి వస్తే ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి ఒక మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో మొట్టమొదటి సారి రాం గోపాల్ వర్మ నిర్మాణంలో నాగ చైతన్య నటించిన బెజవాడ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే మొట్టమొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద హీరోలతో నటించింది.

raghuvaran btech actress amala paul latest look goes viral

ఈ విధంగా కెరీర్ సాగిస్తున్న సందర్భంలోనే కొంత కాలం గ్యాప్ ఇచ్చింది ఈ అమ్మడు. మళ్లీ నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లో, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను చూపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది అమలా పాల్. అలాగే అమలా పాల్ తెలుగు ఇండస్ట్రీలో నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.

raghuvaran btech actress amala paul latest look goes viral

అలాగే తెలుగులో వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ సరసన నటించి ఆకట్టుకుంది. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ రాకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా అంతంతమాత్రంగానే రాణించింది. సినిమాల సంగతి అలా ఉంచితే తాజాగా అమలా పాల్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..