Ads
సీనియర్ నటుడు రాజా రవీంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తొలి నాళ్లల్లో.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్‌గా చేశాడు. ప్రస్తుతం పలువురు యంగ్ హీరోలకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇదే కాక.. కొన్ని చిన్న చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు.
Video Advertisement
ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న ‘తగ్గేదే లే’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజా రవీంద్ర మాట్లాడుతూ యాంకర్ శ్యామలపై సెటైర్లు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాతలు ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లు తలుచుకుంటే ‘బాహుబలి’ లాంటి పది సినిమాలు తీయగలరు కానీ మనకు అలాంటి సినిమాలు వద్దు.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే చాలు అనుకుంటున్నారు. అందుకే ఈ ‘తగ్గేదేలే’ తీశారు. కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. భద్ర ప్రొడక్షన్ కంపెనీ, నిర్మాతలు మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు.’’ అని తెలిపాడు.
ఇలా నిర్మాతలందరికి ధన్యవాదాలు చెబుతూ.. ఆఖర్లో.. ముఖ్యంగా శ్యామలా ఆంటీకి కూడా థాంక్యూ అంటూ ఆమెపై కౌంటర్స్ వేశాడు. రాజా రవీంద్ర మాటలకు షాకైన శ్యామల ఆ వెంటనే తేరుకుని.. ‘నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే’ అంటూ నవ్వుతూనే రాజారవీంద్రపై రివర్స్ కౌంటర్ ఇచ్చింది శ్యామల.
యాంకర్‌లని ఆంటీ అనడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం అనసూయ తనని నెటిజన్లు ‘ఆంటీ’ అనడంపై ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సీనియర్ యాంకర్ సుమని కూడా కమెడియన్లు ఆంటీ అంటూ సరదాగా ఆట పట్టిస్తుంటారు. అలానే జబర్దస్త్‌లో రష్మికి కూడా ఆంటీ కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. అయితే.. అనసూయ మినహా.. మిగిలిన వాళ్లెవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు.
source: https://telugu.filmyfocus.com/raja-ravindra-comments-on-anchor-shyamala/
End of Article