RRR టీజర్ లో ఎన్టీఆర్ ని ముస్లిం గెటప్ లో ఎందుకు చూపించాడో ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ..( వీడియో)

RRR టీజర్ లో ఎన్టీఆర్ ని ముస్లిం గెటప్ లో ఎందుకు చూపించాడో ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ..( వీడియో)

by Mohana Priya

Ads

అక్టోబర్ 22వ తేదీ రానే వచ్చింది. రామరాజు ఫర్ భీమ్ టీజర్ కూడా విడుదలైంది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతంగా, ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది టీజర్. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా టీజర్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగబోతోంది అని అనిపించేలా ఉన్నాయి.

Video Advertisement

ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా సమయం ఉంది. కానీ అప్పుడే మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. చరిత్ర ప్రకారంగా చూసుకుంటే ఇద్దరి కథల్లో కొన్ని మతపరమైన అంశాలు ఉంటాయి. అవి సినిమాలో చూపిస్తున్నారా? అనే ప్రశ్న అందరిలో మొదలైంది. కానీ ఒక సారి మనం ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడు జరిగిన ప్రెస్ మీట్ గుర్తు చేసుకుంటే, అప్పుడే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు రాజమౌళి.

ఒకరు “కొమరం భీమ్ నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు, సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి రిలీజియస్ అంశాలు ఇందులో ప్రస్తావించబోతున్నారా?” అని రాజమౌళిని అడిగారు. ఈ ప్రశ్నకి రాజమౌళి ” ప్రతి సినిమాకి ఏదో ఒక రకంగా వివాదాలు వస్తూనే ఉంటాయి అని,

అసలు ఫిక్షనల్ స్టోరీ అయిన బాహుబలి విషయంలోనే వివాదాలు వచ్చాయని, అలా వివాదాలు రావడం చాలా సాధారణం అయిపోయింది అని, వివాదాలు వస్తాయి అని భయపడి, మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన స్టోరీ తీయకుండా ఆపకూడదు కదా?” అన్నారు.

అంతే కాకుండా ఇది కూడా ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు. కాబట్టి కొమరం భీమ్ ని ముస్లిం పాత్రలో చూపించడానికి వెనక కారణం కూడా నిజ జీవితానికి సంబంధించినది కాకుండా ఏదైనా ఇమాజినరీ స్టోరీ అయ్యుండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అసలు కొమరం భీమ్ , రామరాజు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో, రాజమౌళి వాళ్ళిద్దరి గొప్పతనాన్ని ఏ విధంగా మనకి స్క్రీన్ పై ప్రెజెంట్ చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే.

watch video :


End of Article

You may also like