ఇదేంటి జక్కన్నా ఇంత మాట అనేసావ్..! “రాజమౌళి” పై నెటిజన్స్ కామెంట్స్..!

ఇదేంటి జక్కన్నా ఇంత మాట అనేసావ్..! “రాజమౌళి” పై నెటిజన్స్ కామెంట్స్..!

by kavitha

Ads

దర్శకుడు రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు. సెలెబ్రిటీలు జక్కన్నకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తాజాగా రాజమౌళికి ఎన్టీఆర్ కూడా కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌లో చిన్న కరెక్షన్ ఉందని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

Video Advertisement

ఎన్టీఆర్ ట్వీట్ లో ఇలా రాసుకొచ్చాడు. కంగ్రాట్స్ జక్కన్న,  నీ ప్రయాణం ఆరంభం మాత్రమే, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. నీ గురించి నాకు తెలుసు.ఇక ఇప్పుడు ప్రపంచం కూడా తెలుసుకోబోతోంది అని ట్వీట్ చేసాడు. అయితే దీనికి రాజమౌళి ట్వీట్ చేస్తూ, ఎన్టీఆర్ వేసిన ట్వీట్‌లో చిన్న కరెక్షన్ ఉందని, అది నా ప్రయాణం కాదు, మన ప్రయాణం. మన ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమే అని రాజమౌళి నవ్వేశాడు. అయితేఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్ అంటే RRR కి నెక్స్ట్ పార్ట్ ఉంటుందా  అని అనుకుంటున్నారు.

rrr-rajamouli telugu adda

దాంతో కొంత మంది, “అలా ఇంకొక పార్ట్ ఉంటే బాగుంటుంది” అనుకుంటే, మరికొంతమంది మాత్రం, “ఏంటి రాజమౌళి గారు అలా అనేసారు? ఇప్పుడు మళ్లీ ఇంకొక పార్ట్ అంటే ఈ హీరోలు ఇద్దరూ ఆ సినిమా కోసం మళ్లీ చాలా సంవత్సరాలు వేరే సినిమాలు చేయకుండా ఉంటారు కదా? మళ్లీ వీళ్ళ సినిమాలు సంవత్సరాల తర్వాత చూడాలి కదా” అని సరదాగా అంటున్నారు.

రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్‌లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.

 


End of Article

You may also like