లక్ష్మి కనకాల కన్నుమూత..! ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

లక్ష్మి కనకాల కన్నుమూత..! ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

by Anudeep

Ads

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి కనకాల మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవి కనకాల ఏకైక కుమార్తే , రాజీవ్ ఏకైక సోదరి శ్రీలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు . తండ్రి, అన్నబాటలోనే శ్రీలక్ష్మి కూడా నటిగా అందరికి సుపరిచితమే.

Video Advertisement

గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీలక్ష్మి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో   చికిత్స పొందుతున్నారు..ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతుండగానే తుది శ్వాస విడిచారు. సోదరి మృతితో రాజీవ్ , సుమ కన్నీరు మున్నీరయ్యారు. వరుసగా మూడో ఏడాది రాజీవ్ ఇంట విషాదం చోటుచేసుకోవడం. 2018లో రాజీవ్ తల్లి, దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల స్వర్గస్తులైనారు. భార్య మరణించిన ఏడాదికే దేవదాస్ కనకాల మరణించారు.ఇప్పుడు శ్రీలక్ష్మి మరణంతో రాజీవ్, సుమ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలలముకున్నాయి.

శ్రీలక్ష్మి కొన్ని సినిమాలు ,సీరియల్స్ లో కూడా నటించింది .చిన్నప్పటి చదువులో చురుగ్గా ఉండే శ్రీలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంది. విద్యోదయ హైస్కూల్ లో తన పాఠశాల విద్యను చదివిన శ్రీలక్ష్మి, మద్రాస్ విశ్వవిద్యాలయంలోలో ఎం.ఏ. (ఇంగ్లీష్) పూర్తిచేసింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ప్రముఖ జర్నలిస్టు పెద్ది రామారావుతో 2002లో వివాహం జరిగింది. వీరికి ప్రేరణ,రాగలీన అని ఇద్దరమ్మాయిలు ఉన్నారు.

దూరదర్శన్ లో వచ్చిన “రాజశేఖర చరిత్రము” అనే ధారావాహిక ద్వారా టీవిరంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత తన తండ్రి దర్శకత్వం వహించిన  సీరియల్స్ తోపాటు, ఇతర సీరియల్లలో నటించింది. అంతేకాకుండా ఒక కన్నడ టెలీఫిలిం, ఒక హిందీ చిత్రంలో నటించింది.శ్రీలక్ష్మి నటించిన అగ్నిపూలు సీరియల్లోని పాత్ర తనకి గుర్తింపు తెచ్చింది . ఈటివి ప్రముఖంగా నిర్మించిన ప్రియాంక సీరియల్లో కూడా ముఖ్య పాత్ర పోషించారు, చాలా ఫేమస్ సీరియల్ రుతురాగాలు సీక్వెల్ గా వచ్చిన రుతుధారలో కూడా నటించారు . శ్రీలక్ష్మి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.. చాలా చిన్న వయసులో ఇలా చనిపోవడం విషాదం అని పేర్కొన్నారు.


End of Article

You may also like