కరోనా కష్టకాలంలో వారికి సహాయం చేసి…మరోసారి తన గొప్ప మనసు చాటిన “సుమ”.!

కరోనా కష్టకాలంలో వారికి సహాయం చేసి…మరోసారి తన గొప్ప మనసు చాటిన “సుమ”.!

by Anudeep

Ads

ఏదన్నా విపత్తు రాగానే సిని ప్రముఖులు,పెద్దలు చాలా మంది విరాళాలు ప్రకటిస్తుంటారు.. తాజాగా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించడంతో కష్టాల్లో ఉన్నవారికోసం ఎందరో స్వచ్చందంగా ముందుకి వచ్చి వారి వంతుగా సాయం అందించారు . సిఎం రిలీఫ్ ఫండ్ కి నితిన్, ప్రధాన మంత్రికి నటుడు అక్షయ్ కుమార్ తమ వంతు సాయాన్ని అందచేశారు .సినిమా ఇండస్ట్రీలో కింది స్థాయి కార్మికులకు సాయంగా మెగాస్టార్ చిరంజివి కరోనా క్రైసిస్ చారిటి అని స్థాపించి కోటి విరాళం ప్రకటించాడు.

Video Advertisement

చిరంజివి పిలుపుతో అనేక మంది నటులు ,దర్శకులు, నిర్మాతలు తమ తమ వంతు సాయంగా ఆ చారిటికి విరాళాలు ఇచ్చారు.. అయితే అందరి నుండి ఎప్పుడూ ఒకే మాట వినిపిస్తుంది.. అయ్యా మీరిచ్చే డబ్బులు ఏమవుతాయో ఎవరికి తెలీదు, అవి పేదవాడికి అందే లెక్కా పత్రం ఉండదు.కాబట్టి మీరిచ్చే డబ్బు మీరే స్వయంగా కొన్ని కుటుంబాలకు అందించండి అని చాలా మంది అభిప్రాయపడ్డారు.ఆ మాటల్లో కూడా నిజం ఉందనిపిస్తుంది..ఇన్నిన్ని కోట్లు విరాళలివ్వడమే కనపడుతుంది..వాటి ద్వారా లబ్ధి పొందిన వారెవరో అనేది మాత్రం ఎవరికి తెలియదు.

యాంకర్ సుమ కూడా ఇదే కోణంలో ఆలోచించింది. అందుకే తను కూడా లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలనుకుంది. కొన్ని  నేను ఓల్డేజ్ హోమ్ లతో పాటు డొనేట్ కార్డ్ అనే స్వచ్ఛంద సంస్థకు సాయం చేసింది.  అంతే కాకుండా తెలుగు టెలివిజన్ ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ లో కూడా తన వంతు సాయాన్ని డొనేట్ చేసింది. దాంతో పాటు తన దగ్గర డైరెక్టుగా, ఇన్ డైరెక్ట్గా పని చేస్తున్న ప్రొడక్షన్ బాయ్స్ ,మేకప్, లైటింగ్ ఇలా వివిధ క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న వాళ్ల లిస్ట్ రాసుకుని. వాళ్లందరికి ఆర్దికసాయం చేయాలని ఫిక్సయింది.

‘నేను లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. ఇలాగే ఎవరికి వాళ్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వాళ్ల దగ్గర డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా పనిచేస్తున్న వాళ్లకు సాయం చేస్తే చాలా వరకూ ఇండస్ట్రీలోని అందరికీ సాయం అందుతుంది. నేను ఇలా చేయాలని అనుకుంటున్నా.మీరు కూడా చేయండి’ అంటూ తన నిర్ణయాన్ని అందరితో పంచుకుంది. టాప్ యాంకర్ అంటే ఆ మాత్రం తెలివుంటుంది.. సుమ చేసే సాయం బాగుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 


End of Article

You may also like