రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో నటించిన హీరోయిన్… చివరికి..? ఈమె దుస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో నటించిన హీరోయిన్… చివరికి..? ఈమె దుస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

by kavitha

Ads

సినీ పరిశ్రమను రంగుల ప్రపంచం అని అంటారు. ఇక్కడ ఫేమ్ ఉండి అవకాశాలు వచ్చిన సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలగాలి. లేదంటే అవకాశాలు, ఫేమ్ తగ్గినపుడు, చేతిలో డబ్బు లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. బాగా బ్రతికిన సమయంలో సంపాదించిన డబ్బును దాచుకోలేని ఎందరో గొప్ప నటీనటులు వారి చారమాంకంలో సాయం చేసేవారు లేక దీన స్థితిలో కన్నుమూశారు.

Video Advertisement

అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ నిషా నూర్‌ కూడా ఒకరు. ఆమె ఇప్పటి తరం వారికి తెలియక పోవచ్చు. కానీ 80 లలో ప్రేక్షకులకు సూపరిచితమే. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆమె, ఆ తర్వాత ఊహించిన పరిస్థితుల్లో కన్నుమూసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
actress-nisha-noorనటి నిషా నూర్‌ తన గ్లామర్‌తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, భాను చందర్‌ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్‌ లాంటి వారితో పని చేసింది. కమల్‌ హాసన్ తో కలిసి ‘టిక్‌ టిక్‌ టిక్‌’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్‌ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్‌ స్టేటస్‌ పొందిన నిషా నూర్‌ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్‌ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్‌ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్‌ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్‌ 2007లో అనాధలా మరణించింది.

Also Read: “రిషబ్ శెట్టి” నుండి… “పవన్ కళ్యాణ్” వరకు… సినిమాల కోసం “నాన్-వెజ్” మానేసిన 8 నటులు..!


End of Article

You may also like