సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నటులని పాన్-ఇండియన్ స్టార్స్ అంటున్నారు. ఇందులో మన హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ గుర్తింపును సంపాదించుకున్న తక్కువ మంది నటుల్లో ఒకరు రజినీకాంత్.

Video Advertisement

తమిళ సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్లిన నటుల్లో రజినీకాంత్ ముందు వరుసలో నిలుస్తారు. రజినీకాంత్ ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించారు. అలాగే కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. రజినీకాంత్ డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించడం చాలా తక్కువ. కానీ రజినీకాంత్ అంటే మన తెలుగు హీరో లాగానే తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు.

rajinikantn-telugu adda

అందుకనే రజినీకాంత్ నటించిన డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో ఒక తెలుగు హీరో సినిమాకి ఉండే అంత ఆసక్తితోనే విడుదల అవుతాయి. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఒక తెలుగు హీరో సినిమా విడుదలకి ఎదురు చూసినట్టే ఎదురు చూస్తారు. ఎంతో మంది సెలబ్రిటీలు, అలాగే ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు కూడా రజినీకాంత్ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అని అంటూ ఉంటారు.

అయితే రజినీకాంత్ ఒక తెలుగు సినిమాలో నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ అన్నదమ్ములుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో రజినీకాంత్ ఏ పాత్ర పోషించి ఉండాలి? అని అందరూ అనుకుంటూ ఉంటారు. బహుశా వెంకటేష్ పాత్ర రజినీకాంత్ చేయాలి ఏమో అని అనుకుని ఉంటారు. కానీ కాదు.

Original names of Venkatesh and Mahesh Babu in svsc

ఈ సినిమాలో రజినీకాంత్ ప్రకాష్ రాజ్ పోషించిన రేలంగి మామయ్య పాత్ర పోషించాలి. రజినీకాంత్ కి కథ కూడా బాగా నచ్చిందట. సినిమా కూడా చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఈ సినిమా చేయలేకపోయారు. అసలు రజినీకాంత్ మహేష్ బాబు, వెంకటేష్ కి తండ్రి పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా రావట్లేదు కదా.

ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ అడ్డాల ఒక సమయంలో చెప్పారు. కానీ ఈ పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కి కూడా చాలా మంచి గుర్తింపు వచ్చింది. రేలంగి మామయ్య అంటే ప్రకాష్ రాజ్ మాత్రమే గుర్తొస్తున్నారు. కానీ రజినీకాంత్ చేసి ఉంటే ఎలా ఉండేదో అని అంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.