“సన్యాసి అయినా కూడా..!” అంటూ… స్పందించిన రజనీకాంత్..! ఏం అన్నారంటే..?

“సన్యాసి అయినా కూడా..!” అంటూ… స్పందించిన రజనీకాంత్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఆయన ప్రస్తుతం జైలర్‌ మూవీ విజయం సాధించడంతో సంతోషంగా ఉన్నారు. ఆగష్టు 10న రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్‌లలో ఇప్పటికి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ రిలీజ్‌కు ముందే హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

Video Advertisement

అయితే రజనీకాంత్ తిరుగు ప్రయాణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఆ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన సందర్భంలో యోగి కాళ్ళకు రజనీకాంత్‌ నమస్కారం చేసిన వీడియో చూసిన  నెటిజెన్లు రజినికాంత్ ని విమర్శిస్తున్నారు. దీనిపై తాజాగా రజనీకాంత్ స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై ట్రోల్స్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రజినికాంత్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి, జైలర్‌ మూవీ ఆయనతో కలిసి రజినికాంత్ చూడడం జరిగింది. యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కావడానికి ఆయన నివాసానికి వెళ్ళినపుడు, యోగి రజినికాంత్ ను ఆహ్వానించడం కోసం ఎదురు వచ్చారు. ఆ సమయంలో రజినికాంత్ యోగి ఆదిత్యనాథ్‌ పాదాలకు నమస్కారం చేశాడు. ఆ వీడియో క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వయసులో రజినికాంత్ యోగి కన్నా చాలా పెద్దవాడు. యోగి వయసు చాలా తక్కువ. రజినీ తన కన్నా చిన్నవాడైన యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశాడు. తమిళనాడులో అందరూ నిన్ను ఆరాధిస్తుంటే నువ్వెళ్లి యోగి పాదాలు మొక్కుతావా? తమ ఆత్మాభిమానాన్ని కించపరిచావంటూ తమిళ ఫ్యాన్స్ మండిపడ్డారు. రజిని యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు సమర్ధిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విమర్శల పై స్పందించారు. తాజాగా చెన్నైలో అడుగుపెట్టిన రజినీకాంత్ ను మీడియా ఈ వివాదం గురించి అడుగగా, తన పై వచ్చిన విమర్శుల పై స్పందించాడు. “వయసులో పెద్ద వారైనా, చిన్న వారైనా, సన్యాసి అయినా,  మఠాధిపతి, మత గురువు, యోగి, స్వామిజీ అయినవారి పాదాలకు నమస్కరించడం నా అలవాటు” అని వెల్లడించారు.

Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన “పవన్ కళ్యాణ్” కొడుకు అకీరా..! ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?


End of Article

You may also like