పెళ్లయ్యి 43 ఏళ్లు అవుతున్నా…ఇప్పటికీ పెళ్లి రోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే.!

పెళ్లయ్యి 43 ఏళ్లు అవుతున్నా…ఇప్పటికీ పెళ్లి రోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే.!

by Harika

Ads

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దంపతుల 43వ పెళ్లిరోజుని మొన్న ఫిబ్రవరి 27 న కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ వారి చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో తన చైన్ రింగు చూపిస్తూ రజనీకాంత్,తన రింగు చూపిస్తూ లత కనిపించారు.

Video Advertisement

ఇంతకీ వాటి వెనక ఉన్న కథ ఏమిటంటే 43 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ మార్చుకున్న ఉంగరాలు చైన్ అవి. 43 సంవత్సరాల వివాహ బంధంలో ప్రియమైన అమ్మానాన్న ఎప్పుడూ ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు.పెళ్లయి 43 ఏళ్లు అయినప్పటికీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఆ ఉంగరాలని ధరించి పెళ్లిరోజుని గుర్తు చేసుకుంటారని, ప్రతి ఏటా ఆ చైన్ రింగులు వారిని కలుపుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఆ చైన్ ఉంగరాలని మరొకసారి మార్చుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది సౌందర్య.

ఈ సందర్భంగా అసలు లత, రజనీకాంత్ వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. 1981 ఫిబ్రవరి 26న రజనీకాంత్ పెద్దల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. 1980లో రజనీకాంత్ తిల్లు మల్లు షూటింగ్లో ఉన్నప్పుడు ఒక విద్యార్థిని కాలేజీ మ్యాగజైన్ కోసం ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి పెళ్లి వరకు దారి తీసింది.

చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకున్న రజనీకాంత్ ఇంటర్వ్యూ తర్వాత తన మనసులో మాటని ఆమెతో చెప్పారు. ఆమె నవ్వుతూ తన తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పటంతో సినిమా పెద్దల ద్వారా అమ్మాయి తల్లిదండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రజినీకాంత్. ఆ అమ్మాయే లత. వీరి పెళ్లి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అట్టహాసంగా జరిగింది. ఇక లత మంచి సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా.


End of Article

You may also like