ఈమధ్యకాలంలో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు తరుచుగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్.ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ కొంతమంది సెలెబ్రెటీల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.అయితే తాజాగా రాకేష్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.వివరాల్లోకి వెళ్తే ..

 

అయితే నాగబాబు కు మల్లెమాల టీం కాల్ చేసి నవ్వమంటారని అందుకు తగ్గట్టుగా మేకప్ చేసుకొని కికికి అని నాగబాబు నవ్వుతారని అపహాస్యం చేసారు రాకేష్ మాస్టర్.అలాగే ఎవరి స్కిడ్ బాగుంది అని అనాలో ,ఎవరిని పొగడలో కూడా యూనిట్ సభ్యులు నాగబాబు తో చెప్తారని ఆ విధంగానే నాగబాబు చేస్తారని రాకేష్ మాస్టర్ తెలిపారు.

మల్లెమాల యూనిట్ లో నేను గతంలో డీ 1 ,డీ 2 చేశాను కాబట్టి ఇప్పటికి నాకు మల్లెమాల యూనిట్ లో కొంతమందితో పరిచయాలు ఉన్నాయి అన్నారు రాకేష్  మాస్టర్ .అందుకే జబర్దస్త్ ప్రోగ్రాం లో ఏమి జరుగుతుందో అనే విషయం ఇప్పటికి నాకు కాల్ చేసి కొంతమంది చెప్తారని రాకేష్ మాస్టర్ తెలిపారు.