ఈ టీవిలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన కమెడియన్లలో రాకింగ్ రాకేశ్ ఒకరు.

Video Advertisement

చిన్నపిల్లలతో కామెడీ స్కిట్లు చేయడం ద్వారా పాపులర్ అయిన ఈ కమెడియన్ కేసీఆర్ అనే టైటిల్ తో సినిమా తీయగా ఈ సినిమాకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాకేశ్ ఏవైనా ఆరోపణలు వస్తే నిజం ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు. నిజం ఏదో ఒకరోజు తెలుస్తుందని రాకేశ్ అన్నారు.జబర్దస్త్ లో తీసేశారా? అని కామెంట్లు చేస్తారని రాకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జబర్దస్త్ మానేసిన చాలామంది ఇల్లు గడవట్లేదు అని చెబుతున్నారు కానీ మనస్సు బాధ పడిందని ఎవరూ భావించలేదని ఆయన తెలిపారు. “నా లిమిట్స్ నాకు తెలుసు”రాకేశ్ వెల్లడించారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి స్కిట్లు చేసిన సందర్భాలు ఉన్నాయని రాకేశ్ అన్నారు. భజనకు ప్రయారిటీ ఉంటుందని ఆయన వెల్లడించారు.

 

తిన్నదాని మీద తప్పు మాట్లాడటం తప్పు అని రాకేశ్ అన్నారు. ఎదురు తిరిగేంత సమయం నాకు లేదని రాకేశ్ చెప్పుకొచ్చారు. నన్ను, నా భార్యను కలిపింది రోజా అని ఆయన తెలిపారు. రోజాగారు గంట సమయం కేటాయించి కష్టాల్లో ఉన్న సమయంలో ధైర్యం చెప్పారని రాకేశ్ తెలిపారు. నా పెళ్లిని రోజాగారు అంగరంగవైభవంగా చేశారని రాకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజా వ్యక్తిత్వం మంచిదని ఆయన తెలిపారు.

నేను అమ్మ అమ్మ అని రోజాను ప్రేమలా పిలుచుకుంటానని ;నాకు ఎవరూ లేరని సపోర్ట్ ఉండాలని రోజా భావించారని రాకేశ్ చెప్పుకొచ్చారు. మా అమ్మను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని రాకేశ్ అన్నారు. రాకేశ్ కు కెరీర్ పరంగా మరింత సక్సెస్ దక్కాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాకేశ్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. రాకేశ్ సినిమా ఎప్పుడు థియేటర్లలో విదుదలవుతుందో చూడాల్సి ఉంది.

 

ALSO READ:- రోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?