RAKUL PREET SINGH MARRIAGE: రకుల్ కి కాబోయే భర్త గురించి ఈ విషయాలు తెలుసా.? వీరిద్దరికి ఎలా పరిచయం అంటే.?

RAKUL PREET SINGH MARRIAGE: రకుల్ కి కాబోయే భర్త గురించి ఈ విషయాలు తెలుసా.? వీరిద్దరికి ఎలా పరిచయం అంటే.?

by Mohana Priya

Ads

ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ కొంత కాలం నుండి తెలుగు కంటే ఎక్కువ హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. రకుల్ కి కొంత కాలం నుండి హిందీలో కూడా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏవి రాలేదు.

Video Advertisement

కానీ రకుల్ మాత్రం సెలెక్టివ్ గానే సినిమాల్లో నటిస్తున్నారు. రకుల్ చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏమీ లేవు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రాబోతున్న ఇండియన్ 2 సినిమాలో రకుల్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. 2016 లో శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించారు.

rakul preet singh jackky bhagnani marriage date

ఈ సినిమా ఇప్పుడు విడుదల అవుతోంది. ఆ మధ్యలో నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో రకుల్ ప్రీత్ నటించారు. రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ లో హిట్స్ పెద్దగా లేకపోయినా కూడా వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు కూడా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అయితే రకుల్ ప్రీత్ 2 సంవత్సరాల క్రితం తన పుట్టినరోజు నాడు, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రకటించారు. జాకీ భగ్నాని బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. జాకీ తండ్రి వశు భగ్నాని, తల్లి పూజ భగ్నాని బాలీవుడ్ లో చాలా పెద్ద నిర్మాతలు. ఎన్నో హిట్ సినిమాలు వీరు నిర్మించారు.

rakul preet singh jackky bhagnani marriage date

2009 లో వచ్చిన కల్ కిస్నే దేఖా సినిమాతో జాకీ హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టారు. తర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా ఒక్క సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. త్రిష హీరోయిన్ గా నటించిన మోహిని అనే సినిమాలో కూడా జాకీ నటించారు. జాకీ హిందీలో హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో మన తెలుగు సినిమాల రీమేక్స్ కూడా ఉన్నాయి. లీడర్ కథని పోలిన యంగిస్తాన్, సీమటపాకాయ్ ని అజబ్ గజబ్ లవ్, పెళ్లిచూపులు సినిమాని మిత్రోన్ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఇవి ఏవి కూడా జాకీకి హీరోగా సరైన హిట్ ఇవ్వలేదు. ఇప్పుడు జాకీ కూడా సినిమాల్లో నటించడం ఆపేశారు.

rakul preet singh boy friend jacky bhagnani unknown details

వారి నిర్మాణ సంస్థ అయిన పూజ ఎంటర్టైన్మెంట్ పనులు చూసుకుంటున్నారు. రకుల్ కూడా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరికి కొంత మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారి ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. రకుల్ 2021 లో తన పుట్టినరోజు నాడు వీరి రిలేషన్ షిప్ ని ప్రకటించారు. ఆ తర్వాత చాలా చోట్ల వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం మొదలుపెట్టారు.ఇప్పుడు రకుల్, జాకీ భగ్నాని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన గోవాలో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టేశారు.

rakul preet singh jackky bhagnani marriage date

పెళ్లికి కేవలం దగ్గర వారిని మాత్రమే పిలుస్తారు అని సమాచారం. కేవలం వారి సన్నిహితుల మధ్యలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం జాకీ భగ్నాని బ్యాంకాక్ లోని థాయిలాండ్ లో బ్యాచిలర్ పార్టీలో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రస్తుతం సినిమాల నుండి బ్రేక్ తీసుకొని థాయిలాండ్ లో ఉన్నారు. దాంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూరినట్టు అయ్యింది. చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న తర్వాత, వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి, వారిద్దరికీ పెళ్లి జరిగింది అని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రకుల్ కూడా అలాగే చేస్తారు ఏమో.

ALSO READ : మంచి మనసు చాటుకున్న పవన్ భార్య… అచ్చం పవన్ లాగానే చేశారు…!


End of Article

You may also like