రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

by Anudeep

Ads

ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల అభిమానం చూర గొనడంతో రామ్ చరణ్ తో పాటు మెగా ఫాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.

Video Advertisement

చాలా మందికి తెలిసింది ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు అని. కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమా కంటే ముందే ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

cherry 1

ఈ సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నప్పుడే చాలా మంది రామ్ చరణ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయాలనీ భావించారు. అయితే, అది దాసరికి మాత్రమే సాధ్యమైంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో హీరో గా మెగాస్టార్ చిరంజీవే నటించారు. దాసరి దర్శకుడిగా, మెగాస్టార్ చిరు హీరోగా వచ్చిన “లంకేశ్వరుడు” సినిమాలోనే మెగా పవర్ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

lankeswarudu

కానీ, దురదృష్టం ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేసారు. దీనితో.. సినిమా విడుదల అయిన తరువాత రామ్ చరణ్ చిన్నతనంలో నటించిన సన్నివేశాలేవీ ప్రేక్షకులు చూడలేదు. అయితే.. ఈ విషయం తెలిసిన తరువాత ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సన్నివేశాలను తీసివేయకుండా ఉండి ఉంటె బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.


End of Article

You may also like