Ads
Ramcharan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.ఇది 2024 లో షూటింగ్ ప్రారంభం కానుంది.సినిమాలు, బిజినెస్ ఇలా తీరిక లేకుండా చెర్రీ గడుపుతున్నారు.
ఇండియాలో సినిమాల తర్వాత అత్యంత ఆదరణ కలిగింది క్రికెట్. సినిమాలను అంత ఇష్టంగా చూస్తారో క్రికెట్ ని కూడా అంతే ఇష్టంగా చూస్తారు. ఇండియాలో ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ చూస్తే అర్థమయిపోతుంది క్రికెట్ అంటే మనం వాళ్ళకి ఎంత పిచ్చి ఉందో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా క్రికెట్ అంటే ఇష్టం. అప్పుడప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని అందరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ ఒక క్రికెట్ జట్టుకి యజమానికి అని అన్నారు.
షార్ట్ ఫార్మాట్ లో కొత్తగా వచ్చిన క్రికెట్ లీడ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ పీఎల్) లో ఒక జట్టుని రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. తాను తన హైదరాబాద్ టీం కి బాస్ గా సారథ్యం వహిస్తున్నట్టుగా ఓ ప్రోమోతో అయితే కన్ఫర్మ్ చేసాడు. దీనితో చరణ్ నుంచి ఈ సర్ప్రైజ్ అప్డేట్ ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది. మరి చరణ్ స్టార్ట్ చేసిన ఈ కొత్త జర్నీ సక్సెస్ కావాలని తన ఫాలోవర్స్ కోరుకుంటున్నారు
End of Article