Home Filmy Adda రామ్ చరణ్ అంటే మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో అని మాత్రమే కాదు…ఈ విషయం తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

రామ్ చరణ్ అంటే మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో అని మాత్రమే కాదు…ఈ విషయం తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

by Anudeep

పేదలను ఆదుకోవడంలో అలుపు లేకుండా శ్రమిస్తున్నారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయకుండా అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు.

వేలాది మందికి ప్రత్యక్షంగా, మరెన్నో రెట్లు పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్.  తాజాగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే.. మనం సైతం ఆధ్వర్యంలో ఖర్చుల నిమిత్తం 2 లక్షల ఆర్ధిక సాయం అందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే చనిపోయినావిడకు  ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరునా డైరెక్టర్ సుకుమార్ 1.20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని ఇచ్చారు.

ఇదే విషయాన్ని కాదంబరీ గారు ట్విట్టర్ లో పంచుకున్నారు. “మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో నేను తెలుసుకున్నా.. ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం.. ఇలాంటి విలువలు తెలిసిన మనిషి.
నేను ఎదురుపడితే రామ్ చరణ్ “ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?” అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది.
బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు” అంటూ కాదంబరీ గారు ట్వీట్ చేశారు.

ఇది చూసిన నెటిజన్లు.. రామ్ చరణ్ ను, సుకుమార్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మనసున్న మారాజు కడుపున, అంతకన్నా పెద్ద మనసు వున్న ఈ రాజు పుట్టాడు అని కొందరంటే.. అబ్బాయికి అన్ని బాబాయి పోలికలే అని మరికొందరు ప్రశంశిస్తున్నారు.

You may also like