సముద్రంలో అలల లాగా సినిమాలు కూడా హిట్స్ మరియు ప్లాఫ్స్ తో పడిలేస్తూ ఉంటాయి. ఈ విధంగానే సినీ నటీ నటుల జీవితాలు నడుస్తూ ఉంటాయి. హిట్ వస్తే వారికి మరిన్ని ఆఫర్లు వచ్చి సినీ జీవితం ముందుకు కొనసాగుతుంది. అదే ఫ్లాప్ వస్తే మాత్రం కాస్త వెనుకడుగు పడుతుంది.

Video Advertisement

అలాంటిది ఎంతో మందికి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను, కొరటాల శివ రామ్ చరణ్ విషయంలో మాత్రం చతికిల పడుతూ అభిమానులను ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. టాలీవుడ్ లోనే మాస్ దర్శకుడిగా పేరు పొంది ఎన్నో విజయాలతో ముందుకు పోతున్న బోయపాటి, కొరటాల శివ, రామ్ చరణ్ విషయంలో మాత్రం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ను అందుకున్నారు.

దీనికంటే ముందు ఎన్నో విజయాలు సాధించిన బోయపాటి శ్రీను చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమాతో ఫ్లాప్ అయ్యాడు. దీనికంటే ముందు బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక సినిమా తో ఫ్లాప్ అందుకున్న బోయపాటికి చిన్న హీరో కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.

కానీ వినయ విధేయ రామ సినిమా ఫ్లాపు బోయపాటికి చాలా ఇబ్బంది పెట్టింది. వెంకటేష్, బన్నీ, బాలకృష్ణతో సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టిన బోయపాటి విషయంలో మాత్రం ఈ విధంగా ఫెయిల్ అవ్వడం చూసి అభిమానులు బాధపడుతున్నారు.

మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న కొరటాల శివ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో ముఖ్యమైన పాత్ర రామ్ చరణ్ కాబట్టి కొరటాల శివ కూడా బోయపాటి తరహాలోనే రామ్ చరణ్ తో చేసి బోల్తా పడ్డారని గుసగుసలు మొదలయ్యాయి.