Ads
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ కు అభిమానులు పెరిగిపోయారు ఆయన తదుపరి సినిమాల పైన భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.
Video Advertisement
అయితే రామ్ చరణ్ కెరీర్ మొదట్లో ఆయన నటనకు చాలామంది ట్రోలింగ్ చేసేవారు. తర్వాత నటుడుగా ఆయనను ఆయన మెరుగుపరుచుకుంటూ వచ్చారు.కెరీర్ లో డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
అయితే ఇప్పుడే గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ వెనకాల ఉన్నది మెగా స్టార్ చిరంజీవి అంట.చరణ్ ఏ సినిమాలు చేయాలి అని ఆయనే సలహాలు ఇచ్చేవారట.కొడుకు కోసం చిరు ప్రత్యేక కేర్ తీసుకుని ఒకే రకానికి చెందిన సినిమాల్లో నటిస్తూ ఉంటే జనాలకి బోర్ కొడుతుంది,వారికి ఏ విధమైనటువంటి క్యారెక్టర్‌లో నటిస్తే ఇష్టపడతారు అన్నది తెలుసుకోవడమే హీరోగా మొదటి సక్సెస్ పార్ట్ అని చెబుతూ…డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకో జనాలు ఆదరిస్తారు,అప్పుడు సక్సెస్ నీ వెనకే వస్తుంది అంటూ చరణ్‌కు చిరంజీవి .సలహా ఇచ్చారట.
ఆ తర్వాత ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ లాంటి డిఫరెంట్ కథలున్న చిత్రాలు సెలక్ట్ చేసుకోవడంతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇలా రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్‌గా మార్చి తన బాధ్యతను చిరంజీవి పూర్తిచేశార
End of Article