ఈ ఉక్రెయిన్ వ్యక్తికి రామ్ చరణ్ చేసిన సాయం ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

ఈ ఉక్రెయిన్ వ్యక్తికి రామ్ చరణ్ చేసిన సాయం ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

by Anudeep

Ads

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం భీభత్సమైన పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఉక్రెయిన్ వాసులతో పాటు ఇతర దేశాల వారు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత ఇరవై రోజులుగా ఈ భీకర పోరు నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత్ కు చెందిన విద్యార్థులను ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది.

Video Advertisement

ఇది ఇలా ఉంటె.. కొంతమంది ఉక్రెయిన్ వాసులు భారత్ లో పని చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. వీరు కుటుంబం ఉక్రెయిన్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారిలో ఈ వ్యక్తి కూడా ఉన్నారు.

ఇతని పేరు రస్తీ. ఇతనికి రామ్ చరణ్ కి సంబంధం ఏమిటంటే ఈ వ్యక్తి రామ్ చరణ్ కు సెక్యూరిటీ గార్డ్ గా పని చేసాడు. అసలు రామ్ చరణ్ కి ఉక్రెయిన్ కి ఏమి సంబంధం ఉందా? అని ఆలోచిస్తున్నారా..? ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కొంత భాగం ఉక్రెయిన్ లో కూడా జరిగింది. ఆ సమయంలో రస్తీ రామ్ చరణ్ కి సెక్యూరిటీ గార్డ్ గా పని చేసాడు. షూటింగ్ పూర్తి అయ్యి, భారత్ కు వచ్చేసిన తరువాత కూడా రామ్ చరణ్ రస్తీ తో టచ్ లోనే ఉన్నాడు.

ఇటీవల ఉక్రెయిన్ కు, రష్యా కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో రామ్ చరణ్ రస్తీ కి సాయం అందించారు. దేశం యుద్ధం లో చిక్కుకున్న పరిస్థితులలో రస్తీ తన తండ్రితో కలిసి మిలిటరీలో చేరి దేశాన్ని రక్షించుకునే పనిలో పడ్డారు. ఈ విపత్కర పరిస్థితులలో రామ్ చరణ్ కు రస్తీ కు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కున్నారు. అతని ఫ్యామిలీ ఎలా ఉందో కనుక్కుని అతనికి కొంత డబ్బుని కూడా సాయంగా పంపించారట. ఈ విషయాన్నీ రస్తీనే ఓ వీడియో ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.


End of Article

You may also like