తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా లియో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ఇంకా ఆసక్తిని పెంచాయి. సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి కనెక్ట్ అయిన సినిమా.

Video Advertisement

లోకేష్ కనగరాజ్ గత సినిమాల్లోని కొన్ని ఆనవాళ్లు ఇందులో కనిపిస్తాయి. విక్రమ్ సినిమాకి సంబంధించిన ఒక విషయం ఈ సినిమాలో ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఒక హీరో గొంతు వినిపించడం కానీ, లేదా కనిపించడం కానీ ఉంటుంది అని అంటున్నారు.

ఆ హీరో ఎవరు అనేది ఇంకా తెలియలేదు. అయితే లోకేష్ ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా చేస్తారు అనే ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో కనిపించేది రామ్ చరణ్ అని అంటున్నారు. అంతే కాకుండా ఏవో కొన్ని ట్రైలర్ లోని షాట్స్ చూపించి, అక్కడ వెనక నుంచొని ఉన్నది రామ్ చరణ్ అని అంటున్నారు. కానీ సరిగ్గా చూస్తే అవేవీ నిజం కాదు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉన్నారు అని ఎక్కడో పుకారు అయితే మొదలు అయ్యింది.

కానీ ఇప్పుడు చూస్తే అసలు ఈ సినిమాలో రామ్ చరణ్ లేరు. కేవలం లోకేష్ కనగరాజ్ అంతకుముందు దర్శకత్వం వహించిన సినిమాల్లోని ఒక పాత్ర మాత్రం ఇందులో కనిపిస్తుంది. మరి అది ఎవరు అనేది తెలియదు. దాంతో రామ్ చరణ్ లేరు అనే వార్త కొంత మందికి నిరాశ కలిగించింది. అయితే లోకేష్ ఈ సినిమాకి సంబంధించి లాస్ట్ సినిమా ప్రభాస్ తో చేస్తారు అని చెప్పారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకా వేచి చూడాల్సిందే.

ALSO READ : స్కంద మూవీ కలెక్షన్స్..! ఇప్పటి వరకు వచ్చింది ఎంత అంటే..?