సెకండ్ టైర్ యాక్టర్ తరుణ్ దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు…శ్రీదేవి దగ్గర నుంచి హన్సిక వరకు…ఎందరో ఫిలిం స్టార్ మొదట బాలనాటులుగా చిత్రసీమకు పరిచయమైన వారే. నిన్న మొన్న సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా చూసినవారు అప్పుడే.. హీరో హీరోయిన్లు గా మారిపోతున్నారు. ఇదే కోవకు చెందిన నటి రచ్చ మూవీ లో బాలనాటిగా నటించిన విషికా లక్ష్మణ్.

Video Advertisement

image credits: screenshot from racha movie (volga video youtube)

రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ఒకటి రచ్చ. మంచి మాస్ హీరోగా రామ్ చరణ్ కు గుర్తింపు తెచ్చిన ఈ మూవీలో చిన్నప్పటి తమన్నా పాత్ర పోషించిన పాప.. ఇప్పుడు గుర్తుపట్ట లేనట్టుగా మారిపోయింది. రచ్చ సినిమా 2002లో విడుదల అయింది.. వరుస ప్లాపులతో బాధపడుతున్న మెగా ఫ్యామిలీకి ఊరట కలిగించిన మూవీ రచ్చ.

అప్పట్లోనే దాదాపు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మెగా అభిమానులకు ఎప్పుడు గుర్తుంది పోతుంది. ఈ మూవీలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన విషికా ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.
ఈమె ‘సగిలేటి కథ’, ‘ఏందిరా ఈ పంచాయితీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విషికా కేవలం రచ్చ మూవీ లోనే కాక చాలా సినిమాలలో బాలనాటిగా నటించింది కానీ రచ్చ మూవీ బాలనాటిగా ఆమె చివరి సినిమా కావడంతో చాలా స్పెషల్ అని చెప్పింది. ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ తో మీకు ఉన్న రిలేషన్ ఎలాంటిది అని అడిగినప్పుడు…రచ్చ సినిమాలో రామ్ చరణ్ గారితో నాకు అసలు సన్నివేశాలు లేవు…వాళ్ళిద్దర్నీ నేను అసలు షూటింగ్ సమయంలో చూసింది కూడా లేదు.

ఒకవేళ ఇప్పుడు ఆయన నన్ను చూసినా అసలు గుర్తుపట్టదేమో అని అంది. కొంతమంది నటులు అసలు గుర్తు పట్టినా పట్టకపోయినా …స్టార్ హీరోలతో మాకు బాగా పరిచయం ఉందని చెప్పుకుని తిరిగే ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టుగా నిట్టచిగా చెప్పిన విషికా పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.