Ads
RRR నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించాడంటూ సోషల్ మీడియా లో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.ఒక వైపు సినిమా ల్లో బిజీ గా ఉంటూనే మరో వైపు ఒక ప్రముఖ మొబైల్ అమ్మకం దార్ల సంస్థ కు ప్రచార కర్త గా ఉన్నాడన్న విషయం తెలిసిందే. 75 సంవత్సారాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సదరు సంస్థ వివిధ దిన పత్రికలలో విడుదల చేసిన ప్రకటనలో అశోక ధర్మ చక్రం లేని జాతీయ జెండాను పట్టుకుని ఉన్న రామ్ చరణ్ ఫోటోను వివిధ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ధర్మ చక్రం లేని జెండా ను ఎలా చేత బూనాడంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Video Advertisement
ప్రస్తుతం రామ్ చరణ్ ప్రతిష్టాత్మక RRR తో పాటుగా తన తండ్రి మెగాస్టార్ తో ఆచార్య సినిమా లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తన సహచర నటుడు NTR వ్యాఖ్యాతగా త్వరలో ప్రసారం అవ్వబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కర్టెన్ రైసర్ ఎపిసోడ్ సెలెబ్రెటీ అతిధి గా పాల్గొన్న ప్రోమో ప్రస్తుతం హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే.
End of Article