“ఏజెంట్” సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

“ఏజెంట్” సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

by kavitha

Ads

తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో తిరస్కరించిన సినిమాలలో వేరే హీరోలు నటించడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు బ్లాక్స్‌బస్టర్ విజయాన్ని అందుకుంటే, కొన్ని ప్లాప్ అవుతుంటాయి.

Video Advertisement

ఇలాంటి సందర్భమే టాలీవుడ్ లో ఇటీవల జరిగింది. అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్  అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మొదట హీరోగా అనుకున్నది అఖిల్ ని కాదట. ఈ కథ ముందుగా ఓ తెలుగు స్టార్ హీరోకి చెప్పారంట. అయితే ఆ హీరో రిజెక్ట్ చేయడంతో అఖిల్ కి వెళ్ళింది. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ రీసెంట్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర పోషించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రం కోసం అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్ర దర్శక నిర్మాతల పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఒక వార్త వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ అఖిల్ కాదని, టాలీవుడ్ స్టార్ హీరో అని వినిపిస్తోంది.
ఈ చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీ స్టోరీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడంట. కథ నచ్చినా, చరణ్ కి ఇతర చిత్రాల కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడంట. ఇక ఈ విషయాన్ని ఆ మధ్య రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చరణ్ రిజెక్ట్ చేయడంతో సురేందర్ రెడ్డి అఖిల్‌ కి చెప్పడం, అతనికి  కథ నచ్చడంతో ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఈ మూవీ మొదటి షోకే ఫ్లాప్ టాక్ వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో డినో మోరియా విలన్ గా నటించాడు. ఇక ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు.

Also Read: “అదే మేము చేసిన అతి పెద్ద పొరపాటు..!” అంటూ… “ఏజెంట్” ప్రొడ్యూసర్ పోస్ట్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like