దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అద్భుతంగా నటించాడు అంటూ మన దేశం వాళ్ళే కాకుండా విదేశీయులు కూడా అభినందించారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు.

Video Advertisement

అటు ఎన్టీఆర్ కూడా అదరగొట్టేసాడు. ఇద్దరూ కూడా నేనంటే నేనన్నట్టు స్టెప్పులు వేశారు. నాటు నాటు పాటకి ఇద్దరూ డాన్స్ వేస్తుంటే ఎవరివైపు చూడాలో కూడా అర్ధం కాలేదు ప్రేక్షకులకి. ప్రస్తుతం రామ్ చరణ్ నెంబర్ వన్ హీరోల రేసులో ఒకరిగా నిలిచారు. అయితే రామ్ చరణ్ తుఫాన్ సినిమా మీకు గుర్తుందా..? హిందీలో అది జంజీర్ పేరుతో విడుదల అయింది.

RRR movie re releasing bookings.

జంజీర్ సినిమాని చూసి బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ పై విమర్శలు చేశారు. ఇది మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో బాధ పెట్టింది. రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మగధీర సినిమా చరణ్ క్రేజ్ ని పెంచేసింది. ఒక మంచి హీరోగా గుర్తింపుని పొందాడు చరణ్. జంజీర్ సినిమా 2017 లో వచ్చింది. ఈ సినిమాలో చరణ్ ఏసిపి విజయ్ ఖన్నా గా నటించాడు. ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్లు రావడం జరిగింది.

చరణ్ యాక్టింగ్ గురించి ఆయన ఎక్స్ప్రెషన్స్ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తర్వాత చెర్రీ ఎలాంటి హిందీ సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం చరణ్ ని ఒక మెట్టు ఎక్కించేసింది. ఇప్పుడు రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేసినా బాగుంటుందని బాలీవుడ్ స్టార్స్ కోరుకుంటున్నారు. అప్పుడు చరణ్ ని విమర్శించిన వారు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. అన్ని భాషల వాళ్ళు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చూసి చరణ్ ని పొగుడుతున్నారు. హాలీవుడ్ డైరెక్టర్లు మరొక భాష హీరోయిన్లు కూడా రామ్ చరణ్ తో ఫొటోస్ తీసుకుంటున్నారు.